https://oktelugu.com/

ఆధార్ లో పేరు, పుట్టినతేదీ, అడ్రస్ మార్చవచ్చు.. ఎలా అంటే..?

మన నిత్య జీవితంలో ఇతర కార్డులతో పోలిస్తే ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ ను కలిగి ఉండటం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సులభంగా అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూఐడీఏఐ పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆధార్ కార్డులను మంజూరు చేస్తోంది. అయితే ఆధార్ కార్డులో ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే మాత్రం సులభంగానే ఆ వివరాలను మార్చుకోవచ్చు.          […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 27, 2021 10:24 am
    Follow us on

    మన నిత్య జీవితంలో ఇతర కార్డులతో పోలిస్తే ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ ను కలిగి ఉండటం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సులభంగా అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూఐడీఏఐ పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆధార్ కార్డులను మంజూరు చేస్తోంది. అయితే ఆధార్ కార్డులో ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే మాత్రం సులభంగానే ఆ వివరాలను మార్చుకోవచ్చు.                                                                                                                                                                                                                 ఇంటి నుంచే ఆధార్ కార్డ్ లోని వివరాలను సులభంగా మార్చుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను కలిగి ఉన్నవాళ్లు సులభంగా ఆధార్ కార్డ్ లో తప్పుగా నమోదైన వివరాలను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లడం ద్వారా ఈ వివరాలను మార్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మై ఆధార్ అనే ఆప్షన్ ను ఎంచుకుని డెమోగ్రాఫిక్స్ డేటా ఆన్‌లైన్ ఆప్షన్ ద్వారా ఈ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.

    ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవాళ్లు ఈ విధానం ద్వారా సులభంగా వివరాలను సరి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకునే సమయంలో రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా వివరాలు అప్ డేట్ చేసిన కొన్ని రోజుల్లో మారతాయి. ఆ తర్వాత ఆధార్ కార్డుకు కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి పేమెంట్ ను పూర్తి చేస్తే సరిపోతుంది.

    5 సంవత్సరాల లోపు పిల్లలు ఆధార్ కార్డును పొందాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి వివరాలను నమోదు చేసి రసీదు సంఖ్య సహాయంతో అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు నమోదు ప్రక్రియ జరిగిన మూడు నెలల్లో బాల్ ఆధార్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.