https://oktelugu.com/

వైసీపీలో ఆ వర్గం దూరమవుతోందా..?

ఏపీలో తిరుగులేకుండ పాలన సాగిస్తున్న వైసీపీకి ఓ వర్గం వ్యతిరేకంగా మారుతోందా..? లేక వారిని ఎవరైనా రెచ్చగొడుతున్నారా..? అన్న చర్చ సాగుతోంది. గత కొంత కాలంగా వైసీపీ పాలనపై ఆ వర్గం ప్రజలు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఒక వర్గానికే ప్రాధాన్యతనిస్తోందని, తమను పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్నారు. అయితే ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తోంది, ముఖ్యంగా ఆందోళన చేస్తున్న వర్గానికు జగన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని వైసీపీ సీనియర్ నేతలు అంటున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2021 / 02:12 PM IST
    Follow us on

    ఏపీలో తిరుగులేకుండ పాలన సాగిస్తున్న వైసీపీకి ఓ వర్గం వ్యతిరేకంగా మారుతోందా..? లేక వారిని ఎవరైనా రెచ్చగొడుతున్నారా..? అన్న చర్చ సాగుతోంది. గత కొంత కాలంగా వైసీపీ పాలనపై ఆ వర్గం ప్రజలు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఒక వర్గానికే ప్రాధాన్యతనిస్తోందని, తమను పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్నారు. అయితే ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తోంది, ముఖ్యంగా ఆందోళన చేస్తున్న వర్గానికు జగన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని వైసీపీ సీనియర్ నేతలు అంటున్నారు. మరి వీరు ఆందోళన చేయడానికి కారణమేంటి..?

    గత అంబేద్కర్ జయంతి రోజున ఏపీలోని పలు చోట్ల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు తప్పు చేశామని నినదించారు. అయితే ఎస్సీలు ఇలా ఆందోళన చేయడానికి కారణమేంటని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో జగన్ రెడ్డి రాజ్యాన్ని తేబోతున్నారని, అందుకు అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నారని ప్రచారం చేశారు. అయితే అప్పటి వరకు జగన్ ప్రభుత్వం వెన్నంటే ఉన్నవాళ్లు ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోయారు.

    అయితే ప్రభుత్వం దళితులకు విదేశీ విద్యారుణాలు ఇవ్వడం లేదని, డప్పు కళాకారుల పింఛన్లు నిలిపివేశారని ఆందోళన చేశారు. అయితే ఈరెండు తప్ప మిగతా సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నారు జగన్. అంతేకాకుండా పదవుల విషయంలో తమ వర్గానికి చెందిన వారిని చిన్నచూపు చూస్తున్నారని, ఒకవేళ పదవులు ఇచ్చినా అవి ఇతరుల చేతుల్లోనే పవర్ ఉంటోందని ఆరోపిస్తున్నారు. అందుకే అంబేద్కర్ జయంతిని వేడుకను వేదికగా చేసుకొని కొందరు ఆందోళన చేశారు.

    వైసీపీలోని సీనియర్లు మాత్రం ఎవరో కావాలనే ఇదంతా చేయిస్తున్నారని అంటున్నారు. జగన్ మిగతా వారి కంటే ఎస్సీల సామాజిక వర్గానికి ఎంతో చేశారని అంటున్నారు. ఇటీవల తిరుపతి ఎన్నిక సందర్భంగా ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అయితే ఈ ఆందోళనపై ఇతర నాయకులెవరూ స్పందించకపోవడం గమనార్హం. మరి జగన్ ఏ విధంగా సమాధానం చెబుతాడో చూడాలి.