TDP leader Pattabhi: తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టించారు రాష్ర్టంలో గొడవలకు కారణమయ్యారు. దీంతో పలు కీలక మలుపులు తిరిగిన వివాదం పలు దారుల్లో దుమారం రేపింది. దీంతో రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ ను కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పట్టాభి ఎయిర్ పోర్టులో విమానంలో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో అసలు ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయం అందరిలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఆయన ఎక్కడికి వెళ్లలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పట్టాభిపై పెద్ద నేరమేమి లేదని చెబుతన్నారు. దీంతో పట్టాభి అసలు విమానం ఎందుకు ఎక్కాడు? ఎక్కడికి వెళ్లాడు? అనే దాని మీదే పలు సందేహాలు వస్తున్నాయి.
పట్టాభి వ్యాఖ్యలతో చెలరేగిన ఉద్రిక్తతలు ఓ కొలిక్కి వచ్చినా రెండు పార్టీల్లో విద్వేషాలు మాత్రం రగులుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ వైఖరికి నిరసనగా 36 గంటల పాటు దీక్ష చేసి రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించాలని రాష్ర్టపతిని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీలో గొడవలు సద్దుమణిగినా నేతల్లో మాత్రం దాని తాలూకు గాయాలు మాత్రం మానడం లేదు. ఫలితంగా ఇరు పార్టీలు తమ ప్రభావం చూపించాలని తాపత్రయపడుతన్నాయి.
పట్టాభి మాల్దీవులకు వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై టీడీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. వైసీపీ ఆడిన ఆటలో పట్టాబి పాము అయ్యాడని పేర్కొంటున్నారు. నైతికత పాతరేసి స్వార్థమే పరమార్థంగా వైసీపీ చేస్తున్న ఆగడాలకు అంతులేకుండా పోతోందని చెబుతున్నారు. వైసీపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని టీడీపీ నేతలు పేర్కొన్నారు.