https://oktelugu.com/

సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..? 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ సూసైడ్‌లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న సూసైడ్‌ సుశాంత్‌కు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌కు డ్రగ్స్‌ సప్లయ్‌ చేసిన కుక్‌ను, అతడి మేనేజర్‌‌ను ఎన్సీబీ అరెస్టు చేయగా.. సుశాంత్‌కు డ్రగ్స్‌ సప్లై చేసినట్లుగా వారు ఒప్పుకున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. మొత్తానికి చ‌నిపోయిన ఇన్నాళ్లకు సుశాంత్‌ను డ్రగ్స్‌ తీసుకొనే వ్యక్తిగా చిత్రీకరించారు. మొదటి నుంచీ సుశాంత్‌ మరణం అనుమానాస్పదమనే అతని కుటుంబసభ్యులు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 12:40 PM IST
    Follow us on

    బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ సూసైడ్‌లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న సూసైడ్‌ సుశాంత్‌కు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌కు డ్రగ్స్‌ సప్లయ్‌ చేసిన కుక్‌ను, అతడి మేనేజర్‌‌ను ఎన్సీబీ అరెస్టు చేయగా.. సుశాంత్‌కు డ్రగ్స్‌ సప్లై చేసినట్లుగా వారు ఒప్పుకున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. మొత్తానికి చ‌నిపోయిన ఇన్నాళ్లకు సుశాంత్‌ను డ్రగ్స్‌ తీసుకొనే వ్యక్తిగా చిత్రీకరించారు. మొదటి నుంచీ సుశాంత్‌ మరణం అనుమానాస్పదమనే అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నటి రియా చక్రవర్తి కారణమంటూ ఫిర్యాదు కూడా చేశారు. అయితే.. సుశాంత్‌ మరణం విషయంలో చేస్తున్న కేసు విచారణలో ఈ డ్రగ్స్‌ వ్యవహారం వెలుగులోకి రావడం ఆసక్తి కలిగిస్తోంది.

    Also Read: థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా?

    రియా రిక్రూట్‌చేసిన సుశాంత్‌ మేనేజర్‌‌ను అరెస్టు చేసి విచారించగా.. అతను ఈ డ్రగ్స్‌ వ్యవహారం బయటపెట్టాడు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇంకొంత మందిని అరెస్టు చేశారు. సుశాంత్‌ అంటే యూత్‌కు క్రేజ్‌. అందులోనూ ధోనీ బయో హీరో. ప్రతిభావంతమైన నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. చాలా మంది బాలీవుడ్‌ పెద్దలు కూడా సినిమాల్లోని అతని యాక్టింగ్‌ను కీర్తించారు.

    ఇలా అందరిలోనూ మంచివాడిగా పేరు తెచ్చుకున్న సుశాంత్‌ను ఇప్పుడు డ్రగ్స్‌ వినియోగదారుడిగా నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌కు బలవంతంగా డ్రగ్స్‌ వాడే అలవాటు చేశారనేది కూడా మరో వాదన. అంటే.. ఇప్పుడు సుశాంత్‌ లేడు కాబట్టి ఏ వాదన అయినా అతని చేయచ్చు అనే దిశగా విచారణ సాగుతోందని పలువురు అంటున్నారు. గ‌త కొంత‌కాలంగా సుశాంత్ విష‌యంలో వ‌స్తున్న వార్తలు కొంత విస్మయకరంగానే ఉంటున్నాయి.

    Also Read: కరోనాకి దూరంగా ‘పుష్ప’ ప్రత్యేక జాగ్రత్తలు !

    ఈ కేసులో రియా ప్రమేయంపై వచ్చిన ఆరోపణలకు, ప్రస్తుత పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. ఆమె సుశాంత్‌ను ఫైనాన్షియల్‌గా దెబ్బతీసిందనే తీవ్ర ఆరోపణ ఉంది. ఆ దిశగా విచారణ జరగాల్సిన కేసు.. ఇప్పుడు పూర్తిగా డ్రగ్స్ మీదకు మళ్లింది. రియా మీద వచ్చిన ఆరోపణలపైనా ఇప్పుడు అలికిడి లేదు. రియా సోదరుడిని అరెస్టు చేసినా.. అది డ్రగ్స్‌ కోణంలో విచారణ చేశారు. రేపోమాపో  రియాను కూడా అరెస్టు చేస్తార‌ని ఆమె తండ్రే అంటున్నాడు. అయితే.. ఆమె అరెస్ట్ సుశాంత్‌ సూడైడ్‌ కేసులో కాకుండా ఈ డ్రగ్స్‌ కోణంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.