నేటి సాయంత్రం 6 నుంచి రాత్రి 9గంటల వరకు బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం కాబోతుంది. ‘స్టార్ మా’లో మొత్తం మూడు గంటలపాటు ప్రారంభ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. బిగ్ బాస్-4కు సంబంధించిన తాజా ప్రోమో ఓ రేంజ్లో అదిరిపోయింది. కింగ్ నాగార్జున తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్-4 శని, ఆదివారాల్లో రాత్రి 9గంటలకు ప్రసారం కానుంది. మిగతా వారాల్లో మాత్రం 9:30కు ప్రసారం కాబోతుంది. ఇక శని- ఆది వారాలు మాత్రమే ఈ షోలో నాగార్జున పాల్గొంటారట.
‘బిగ్ బాస్-4’లో ప్రారంభ ఎపిసోడ్లో కింగ్ నాగార్జున ఈమేరకు సందడి చేయబోతున్నాడో ప్రోమోలోనే చిన్న క్లూ ఇచ్చాడు. తాను నటించిన సోగ్గాడే చిన్నినాయనా మూవీలోని బంగార్రాజు గెటప్ లో రాబోతున్నట్లు హింటిచ్చాడు. దీంతో ప్రారంభ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. మాస్కులు ముఖానికే.. ఎంటటైన్మెంట్ కాదంటూ కింగ్ నాగార్జున ఎంట్రీతోనే చెప్పిన డైలాగులు అందరికీ కనెక్ట్ అయ్యాయి.
Also Read: సంచలన విషయాలు : సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడా..?
బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం నుంచి కంటెస్టుల విషయంలో చాలా పేర్లు విన్పించాయి. స్టార్ సెలబ్రెటీలు, గ్లామర్ బ్యూటీల బిగ్ బాస్-4లో పాల్గొంటున్నట్లు ప్రచారం జరగడంతో అంచనాలు పెరిగాయి. గత సీజన్లకు భిన్నంగా కొత్తగా బిగ్ బాస్-4 ఉండనుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ షోను ఎంతమేరకు సాఫీగా కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కరోనా టైంలో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ‘బిగ్ బాస్’ ఆదివారం నుంచే వస్తుందటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.