Special Status: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను చర్చించేందుకు కేంద్రం సిద్ధమైంది. కానీ చివరి క్షణంలో ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లు ప్రత్యేక హోదా కోసమే ఉద్యమాలు జరిగిన విషయం తెలిసిందే. కానీ అకస్మాత్తుగా కేంద్రం ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు చర్చించమని చెప్పడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఇప్పుడే ప్రత్యేక హోదా ఇస్తే బాగుండదనే ఉద్దేశంతో రఘురామ పోటీ చేసినప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చి దాని ద్వారా ఓట్లు సంపాదించుకోవాలని భావిస్తున్నట్లు కూడా మరో వాదన వస్తోంది. దీంతోనే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. నరసాపురం ఎన్నిక కోసం వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదాతో ప్రయోజనాలు సాధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో కూడా బీజేపీకి పట్టు కావాలని చూస్తున్నారు. అందుకే ప్రత్యేక వాదాన్ని ప్రస్తుతం పక్కన పెట్టి అవసరమైనప్పుడు బయటకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే ప్రత్యేక హోదాతో అన్ని ప్రయోజనాలు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
Also Read: జగన్ ను ఇరుకున పెట్టిన కేసీఆర్
బీజేపీ చేస్తున్న ఆలోచనకు పరిస్థితులు అనుకూలిస్తే ప్రత్యేక హోదా పార్టీకి అనుకూల ప్రయోజనాలు తీసుకురావచ్చు. ఈనెల 17న ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై చర్చించేందుక సమావేశం ఉన్నందున అందులో ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెడుతున్నట్లు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రత్యేక హోదాపై ఓ కమిటీ వేయాలని కేంద్రానికి లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఏపీకి ఏదో తాయిలం ప్రకటించేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో తన పరపతి నిరూపించుకోవాలని చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రత్యేక హోదా అంశాన్ని అనుకూలంగా చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
Also Read: మరోసారి ‘చలో విజయవాడ’: ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన టీచర్లు