https://oktelugu.com/

RRR : ఆర్ఆర్ఆర్ అయిపోగానే రాంచరణ్, ఎన్టీఆర్ ఎలా పారిపోయారంటే.. వీడియో

అసలే జక్కన్న.. ఆయనతో సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు అర్పించాల్సిందే.. బాహుబలి సినిమాకు ఏకంగా ఐదేళ్ల పాటు ప్రభాస్ ను లాక్ చేశాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా మూడేళ్ల పాటు అగ్రహీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లను బుక్ చేశాడు. కరోనా రాకతో సినిమా మరింత ఆలస్యమైంది. ఈ క్రమంలోనే ఈరోజు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసిందని యూనిట్ మొత్తం గుమ్మడికాయ కొట్టేసింది. ఇక ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసినట్టేనని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్, రాంచరణ్ ఊపిరిపీల్చుకున్నారు. దొరికితే […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2021 / 07:19 PM IST
    Follow us on

    అసలే జక్కన్న.. ఆయనతో సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు అర్పించాల్సిందే.. బాహుబలి సినిమాకు ఏకంగా ఐదేళ్ల పాటు ప్రభాస్ ను లాక్ చేశాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా మూడేళ్ల పాటు అగ్రహీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లను బుక్ చేశాడు. కరోనా రాకతో సినిమా మరింత ఆలస్యమైంది.

    ఈ క్రమంలోనే ఈరోజు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసిందని యూనిట్ మొత్తం గుమ్మడికాయ కొట్టేసింది. ఇక ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసినట్టేనని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్, రాంచరణ్ ఊపిరిపీల్చుకున్నారు. దొరికితే రాజమౌళి బుక్ చేస్తాడని.. షూటింగ్ ముగిసిన సంతోషంలో స్పోర్ట్స్ కారులో వేగంగా పలాయనం చిత్తగించారు.

    తాజాగా ఆర్ఆర్ఆర్ టీం ఓ వీడియోను షేర్ చేసింది. అది చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.. మన హీరోలిద్దరూ కూడా వాయువేగంతో నువ్వానేనా అన్నట్టుగా కారులో దూసుకెళ్లిపోయారు. అసలే మన హీరోల కార్ల రేంజ్ ఏంటో తెలిసిందే. ఇద్దరూ కలిసి షూటింగ్ ముగిసిన అనంతరం సెట్ నుంచి జెట్ స్పీడుతో లగ్జరీ స్పోర్ట్స్ కారులో స్పీడుగా దూసుకెళ్లారు. అక్కడ ఉన్న వారంతా వీళ్ల కార్ల వేగం చూసి షాక్ అయ్యారు.

    ‘టైగర్, చీతా’ అంటూ రాంచరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ కార్లో వేగంగా దూసుకెళ్లిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీం షేర్ చేసింది. క్షణాల్లోనే కనిపించి మాయమైపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.