Real Estate: తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు పది లక్షల వరకు రిజిస్రేషన్లు జరగడం చూస్తుంటే రియల్ ఎస్టేట్ ఎంతలా విజృంభిస్తుందో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొలాల కంటే ఇళ్ల స్థలాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో రాష్ర్టంలో ఆదాయం కూడా భారీగానే ఉంటోంది.

రోజువారీ ఆదాయం రూ. 40 కోట్ల వరకు వస్తుండటంతో ప్రభుత్వానికి భారీ మొత్తంలోనే లాభాలు వస్తున్నాయి. భూములు, ఇళ్ల క్రయ విక్రయాలు పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతోంది. ఆదాయం పెంపుతో పండగ చేసుకుంటోంది. పలు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపుమీదుంది. దీంతో డబ్బులు కూడా అంతే స్థాయిలో రావడం తెలిసిందే.
Read Also: తారక్‌కు ఉన్న ఆస్తుల విలువ తెలిస్తే.. మీకు షాక్..
దీనికి తోడు హైదరాబాద్ నగరం కూడా శరవేగంగా విస్తరిస్తోంది. రియల్ ఎస్టేట్ లో బెంగుళూరు కంటే కూడా అభివృద్ధి చెందుతోందని పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆదాయ మార్గానికి అనువుగా మారుతోంది. ఫలితంగా రూ. కోట్ల ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపుతుండటం విశేషం.
తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోంది. దీంతో ఆదాయం కూడా అదే రేంజిలో పెరుగుతోంది. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం ఈ జిల్లాల నుంచే రావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి సాధించడంతోనే ప్రభుత్వ ఆదాయం కూడా రెట్టింపవుతోంది. రియల్ ఎస్టేట్ తోనే గణనీయమైన ఆదాయం పెరగడం తెలుస్తోంది.
Read Also: కరోనా కాటు.. మళ్లీ స్కూళ్లు బందేనా?