https://oktelugu.com/

రఘురామ ఒంటరైపోయారా?

రఘురామ కృష్ణంరాజు ఒంటరైపోయారు. మూడు రోజుల క్రితం అరెస్టయిన ఆయనపై సొంత పార్టీ వాళ్లే పట్టించుకోవడం లేదు. దీంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే వచ్చే ప్రమాదంపై ముందే ఊహించి ఉండరు. దీంతోనే అధినేతపైనే ఆరోపణలు చేసి చివరికి కటకటాలపాలయ్యారు. విచిత్రంగా ప్రతిపక్షాల వారు మాత్రం రఘురామకు మద్దతుగా నిలవడం గమనార్హం. రాజకీయాలెలా ఉన్నా సొంత పార్టీ వారు వెంట రాకపోయినా ఇతర పార్టీల వారు మాత్రం తమ గళం విప్పారు. వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 17, 2021 / 03:56 PM IST
    Follow us on


    రఘురామ కృష్ణంరాజు ఒంటరైపోయారు. మూడు రోజుల క్రితం అరెస్టయిన ఆయనపై సొంత పార్టీ వాళ్లే పట్టించుకోవడం లేదు. దీంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే వచ్చే ప్రమాదంపై ముందే ఊహించి ఉండరు. దీంతోనే అధినేతపైనే ఆరోపణలు చేసి చివరికి కటకటాలపాలయ్యారు. విచిత్రంగా ప్రతిపక్షాల వారు మాత్రం రఘురామకు మద్దతుగా నిలవడం గమనార్హం. రాజకీయాలెలా ఉన్నా సొంత పార్టీ వారు వెంట రాకపోయినా ఇతర పార్టీల వారు మాత్రం తమ గళం విప్పారు. వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

    సామాజిక వర్గం సైతం..
    రఘురామ కృష్ణం రాజుకు సొంత సామాజికవర్గం సైతం సహకరించట్లేదు. ఆయనకు మాకు ఏ సంబంధం లేదని తేల్చారు. దీంతో రఘురామ ఒంటరిగా మిగిలిపోయారు. క్షత్రియ సామాజిక సమాఖ్య రఘురామ అరెస్టుతో మాకు సంబంధం లేదని ప్రకటించింది. దీంతో క్షత్రియ సామాజిక వర్గం మద్దతు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రఘురామ వ్యవహారం కాస్త ఇరకాటంలో పడింది. ఇన్నాళ్లు తమ కులం వారు ఉన్నారని చెప్పుకున్న రఘురామ ప్రస్తుతం ఎవరి సాయం లేకుండా ఉండిపోవాల్సి వస్తోంది.

    కులస్తులెవరూ..
    రఘురామ వ్యవహారంలో వారి కులస్తులెవరూ స్పందించడం లేదు. కనుమూరి బాపిరాజు, గోకరాజు గంగరాజు, కృష్ణంరాజు వంటి వారు కూడా రఘురామపై కనికరం చూపడం లేదు. ఫలితంగా ఆయన పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. క్షత్రియ కులంలో పుట్టినా ఆయన మాటలకు ఎవరు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో రఘురామ భవితవ్యం గందరగోళంలో పడింది.

    ప్రతిపక్షాల మద్దతు
    రఘురామ అరెస్టుతో ప్రతిపక్షాల గొంతు మాత్రం తెరుచుకుంది. వారు రఘురామ అరెస్టును ఖండిస్తున్నారు. పరాయి పార్టీ అయినా వారి సానుభూతితో సాంత్వన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రఘురామ అరెస్టును ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ప్రతిపక్షాల తీరు సహజంగానే స్పందిస్తున్నా సొంత పార్టీ వారు పట్టించుకోవడం లేదు. దీంతో సొంత వారిపై పెట్టుకున్న నమ్మకం కాస్త వమ్ము అయింది. నమ్ముకున్న వారే నట్టేట ముంచారు. అయినా తన భార్య, కొడుకు మాత్రం రఘురామకు న్యాయం చేయాలని రోదిస్తున్నారు.