https://oktelugu.com/

అరెరే.. స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం !

అరెరే ముదురు భామ ‘ప్రియాంక చోప్రా’ కుర్ర భర్తకి ప్రమాదం జరిగి ఆరోగ్యం తేడా చేసింది. మరి ఈ కరోనా టైంలో ఏదో షో అని వెళ్లడం దేనికి ? షో కోసం అని వెళ్లి, మొత్తానికి అతగాడు చివరకి నేరుగా ఆసుత్రిలో చేరాడు. అసలు విషయంలోకి వెళ్తే.. హాలీవుడ్ గాయకుడిగా ప్రియాంక భర్త నిక్ జోనస్ కి మంచి గుర్తింపు ఉంది. దాంతో లాస్‌ ఏంజెల్స్‌లో శనివారం జరిగిన భారీ రియాలిటీ షోలో ‘ది వాయిస్‌’ […]

Written By:
  • admin
  • , Updated On : May 17, 2021 / 04:07 PM IST
    Follow us on


    అరెరే ముదురు భామ ‘ప్రియాంక చోప్రా’ కుర్ర భర్తకి ప్రమాదం జరిగి ఆరోగ్యం తేడా చేసింది. మరి ఈ కరోనా టైంలో ఏదో షో అని వెళ్లడం దేనికి ? షో కోసం అని వెళ్లి, మొత్తానికి అతగాడు చివరకి నేరుగా ఆసుత్రిలో చేరాడు. అసలు విషయంలోకి వెళ్తే.. హాలీవుడ్ గాయకుడిగా ప్రియాంక భర్త నిక్ జోనస్ కి మంచి గుర్తింపు ఉంది. దాంతో లాస్‌ ఏంజెల్స్‌లో శనివారం జరిగిన భారీ రియాలిటీ షోలో ‘ది వాయిస్‌’ షూటింగ్ కోసం అతను వెళ్ళాడు.

    ఆ సమయంలో నిక్‌ కు చిన్న ప్రమాదం జరిగి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నిక్ కి పెద్దగా గాయాలు ఏమి కాలేదు. దాంతో డాక్టర్ల అతనికి చిన్నపాటి చికిత్సను ఇచ్చి ఆదివారం డిశ్చార్జ్‌ చేశారు. అయితే నిక్ యదావిధిగా ఈ రోజు తన రియాలిటీ షో ‘ది వాయిస్’లో పాల్గొన్నాడు.

    కానీ ప్రియాంక చోప్రా మాత్రం తెగ టెన్షన్ పడిందట. తన కుర్ర భర్తకు గాయాలు ఎలా అయ్యాయో అని తనలో తానే వణికిపోయిందట. మరి ఎంతైనా 2018లో ప్రియాంక, నిక్ జొనాస్‌ ను ఘాడంగా మించి పెళ్లి చేసుకుంది. తనకంటే ఏకంగా నిక్‌ పదేళ్లు చిన్న వాడు అని తెలిసినా… ప్రియాంక మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. ప్రేమకు వయసుతో పనేంటి అన్నట్టుగా ముందుకు సాగింది ప్రియాంక.

    ప్రస్తుతం వీరిద్దరూ తమతమ వృత్తుల్లో ఫుల్ బిజీగా ఉ‍న్నా.. ఇద్దరు తమ కోసం ప్రత్యేకమైన ఏకాంత సమయాన్ని కేటాయించుకుంటుంటారు. ఇక ఈ మధ్య నిక్ ప్రియాంక పై ఎక్కువగా కోప్పడుతున్నాడట. ఆమె వచ్చాకా అతని జీవితం మొత్తాన్ని ఆమె ఆక్రమించుకుందట. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది.