https://oktelugu.com/

చైనా వస్తువుల బహిష్కరణ సాధ్యమయ్యేనా?

భారత్-చైనా సరిహద్దుల్లో గడిచిన నెలరోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత సోమవారం రాత్రి ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందారు. శాంతి చర్చల పేరుతో చైనా భారత్ ను దొంగదెబ్బతీయడంపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరజవాన్లను ఘననివాళి పాటిస్తూనే చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సైతం జవాన్ల వీరమరణం వృథాగా పోనివ్వమని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో కమాండర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 18, 2020 / 05:08 PM IST
    Follow us on


    భారత్-చైనా సరిహద్దుల్లో గడిచిన నెలరోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత సోమవారం రాత్రి ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందారు. శాంతి చర్చల పేరుతో చైనా భారత్ ను దొంగదెబ్బతీయడంపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరజవాన్లను ఘననివాళి పాటిస్తూనే చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సైతం జవాన్ల వీరమరణం వృథాగా పోనివ్వమని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించారు. అదేవిధంగా త్రివిధ దళాలు సైతం సిద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.

    ఇదిలా ఉంటే భారత జవాన్ల మృతిని నిరసిస్తూ భారతీయులంతా చైనా వస్తువుల బహిష్కరణకు శ్రీకారం చుట్టారు. చైనా తయారుచేసే వస్తువులకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనా తయారుచేసే వస్తువులన్నీ భారత్ లోనూ తయారవుతున్నప్పటికీ చైనా వస్తువులు తక్కువ మొత్తానికి లభిస్తుండటంతో ప్రజలు వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. చైనా సోమవారం రాత్రి దొంగదెబ్బతీసి భారత సైనికులను పొట్టనపెట్టుకోవడంతో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. చైనాను ఆర్థికంగా దెబ్బకొడిస్తే అదే కాళ్లబేరానికి వస్తుందనే అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

    ఇప్పటికే పలువురు చైనా వస్తువులను, చైనా యాప్స్ ను బహిష్కరిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి భారతీయుల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుంది. ఇప్పటికే చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు చాలా వరకు ఇండియాలో తయారవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ ఉత్పత్తులను మనమే తయారు చేసుకుంటున్న సంగతి తెల్సిందే. స్థానికంగా తయారుచేసుకుంటూ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై తొలుత బ్యాన్ విధించాలని కేంద్రం భావిస్తుంది. ఆ తర్వాత క్రమంగా మిగతా చైనా వస్తువుల వాడకం తగ్గించి క్రమంగా అన్ని వస్తువులు భారత్లోనే తయారు చేసుకునేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. మన వస్తువులను మనమే వినియోగించున్నట్లయితే చాలావరకు విదేశీ వస్తువులను కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పటికి సాధ్యం అవుతుందనేది వేచి చూడాల్సిందే..!