చైనాపై కేఏ పాల్ హెచ్చరిక.. మోడీ వినలేదా?

రాజకీయ నాయకుడు, ప్రముఖ సువార్తకుడు.. తన చేష్టలతో కామెడీ పండించిన కేఏపాల్ చైనాతో ఘర్షణ వేళ మళ్లీ లైన్లోకి వచ్చాడు. మరోసారి సీరియస్ కామెడీని పంచేశాడు.. ఏపీ ఎన్నికల వేళ పోటీచేసి హల్ చల్ చేసిన దొరవారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మరోసారి దర్శనమిచ్చారు. తన మాట వినకపోవడం వల్లే చైనా చేతిలో భారత్ దెబ్బతిందని హితబోద చేశాడు. ఫిబ్రవరిలో చైనా చెడ్డదారిలో వెళుతోందని తాను భారత్ ను హెచ్చరించానని.. కరోనా సృష్టించి ఇప్పుడు భారత్ […]

Written By: NARESH, Updated On : June 18, 2020 6:18 pm
Follow us on


రాజకీయ నాయకుడు, ప్రముఖ సువార్తకుడు.. తన చేష్టలతో కామెడీ పండించిన కేఏపాల్ చైనాతో ఘర్షణ వేళ మళ్లీ లైన్లోకి వచ్చాడు. మరోసారి సీరియస్ కామెడీని పంచేశాడు..

ఏపీ ఎన్నికల వేళ పోటీచేసి హల్ చల్ చేసిన దొరవారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మరోసారి దర్శనమిచ్చారు. తన మాట వినకపోవడం వల్లే చైనా చేతిలో భారత్ దెబ్బతిందని హితబోద చేశాడు. ఫిబ్రవరిలో చైనా చెడ్డదారిలో వెళుతోందని తాను భారత్ ను హెచ్చరించానని.. కరోనా సృష్టించి ఇప్పుడు భారత్ సైనికులను చంపాక కానీ తన మాటలు నమ్మరా అని భారత్ పై తన సానుభూతి తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు.

చైనా కదలికలను గ్రహించిన మొదటి వ్యక్తిని తానేనని.. మార్చిలో నేను దీనిపై ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులకు లేఖ రాశానని వీడియోలో తనను తాను గొప్పలు చెప్పుకున్నారు కేఏపాల్. ఇప్పటికీ లక్షలాది సంతకాలు చేస్తూ చైనాకు వ్యతిరేకంగా తాను ప్రపంచ దేశాలను ఏకం చేస్తున్నానని.. భారతీయులు, తెలుగు వారంతా తనతో కలిసి రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చాడు.

చైనా కారణంగా మూడవ ప్రపంచ యుద్ధం చెలరేగే అవకాశం ఉందని తాను అనేక దేశాలను హెచ్చరించానని కేఏపాల్ పేర్కొన్నారు. వూహాన్ లో కరోనా వైరస్ ను సృష్టించింది చైనా అని.. వివిధ దేశాలకు విస్తరింపచేస్తుందని తాను ఫిబ్రవరిలోనే హెచ్చరించానని కేఏపాల్ తన వీడియోలో పేర్కొన్నారు.

చైనా నుంచి కరోనా వైరస్ నుంచి తాను భారత్ ను రక్షిస్తానని కేఏపాల్ చెప్పుకొచ్చాడు. తనతో భారత ప్రభుత్వం, మోడీ చేతులు కలపాలని పిలుపునిచ్చాడు.

ఇలా కేఏపాల్ మాటలు కోటలు దాటేశాయి. ట్రంప్ నుంచి మొదలుపెడితే మోడీ, తెలుగు రాష్ట్రాలు, టీవీ9, ఏబీఎన్ చానెళ్లను కూడా కేఏపాల్ టార్గెట్ చేసిన తీరు చూశాక.. నిజంగానే కేఏపాల్ ను భారత సాయుధ దళంలో చేర్చుకొని చైనా సరిహద్దుల్లో నిలబెట్టి యుద్ధం జరుగకుండా శాంతి వచనాలు వినిపించాలని పలువురు సెటైర్లు వేస్తున్నారు.