Kodali Nani: కొడాలి నాని సైలెంట్ వ్యూహమా? వ్యూహాత్మకమా?

రాజకీయాల్లో దూకుడు స్వభావం కొద్దిరోజులు పార్టీ పనిచేస్తుంది. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లు చేస్తే ఆహా ఓహో అంటూ తొలినాళ్లలో అందరూ ప్రోత్సహిస్తారు. అయితే అది వికటించి ముదిరితే మాత్రం వెగటుగా మారడం తప్పదు.

Written By: Dharma, Updated On : November 23, 2023 9:11 am

Kodali Nani

Follow us on

Kodali Nani: కొద్దిరోజులుగా ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సైలెంట్ అయ్యారు. పెద్దగా మాట్లాడడం లేదు. దీని వెనుక రకరకాల ప్రచారం జరుగుతోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే కొడాలి నాని కాస్త సైలెంట్ అయ్యారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్, బెయిల్ తదనంతర పరిణామాల తర్వాత పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. మీడియా ముందుకు వచ్చేందుకు సైతం ఇష్టపడడం లేదు.సాధారణంగా చంద్రబాబు, లోకేష్ అంటే అంత ఎత్తుకు కొడాలి నాని లెగుస్తారు. నోటికి వచ్చినట్లుగా బండ బూతులు తిడతారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎందుకో నాని పెద్దగా మాట్లాడడం మానేశారు.

వైసీపీ కోసం, జగన్ కోసం కొడాలి నాని తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి కొడాలి నాని ఈ తరహా ప్రకటనలు వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు ఉంటాయని తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత కొడాలి నాని ఎటువంటి ఇబ్బంది పడకపోయినా.. కొన్ని రకాలుగా పరిణామాలు ఆయనను ఆలోచనలో పెట్టేసినట్లు తెలుస్తోంది.టిడిపి, జనసేన కలవడంతో ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో కూటమి దిశగా ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాను మాట్లాడే టార్గెట్ అవడం ఎందుకన్న ఆలోచనతోనే కొడాలి నాని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లో దూకుడు స్వభావం కొద్దిరోజులు పార్టీ పనిచేస్తుంది. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లు చేస్తే ఆహా ఓహో అంటూ తొలినాళ్లలో అందరూ ప్రోత్సహిస్తారు. అయితే అది వికటించి ముదిరితే మాత్రం వెగటుగా మారడం తప్పదు. కొడాలి నాని విషయంలో ఇదే జరిగింది. ఆయన చంద్రబాబును ఎంత ఎక్కువ తిడితే వైసీపీతో పాటు ఆ పార్టీ శ్రేణులు అంతగా అక్కున చేర్చుకునేవి. అయితే సామాన్య జనం, రాజకీయాలతో సంబంధం లేని వారికి మాత్రం ఇది నచ్చలేదు. చివరికి వైసిపి, జగన్ను అభిమానించే వారు సైతం ఈ చర్యలను తప్పుపడుతున్నారు. రాజకీయ సిద్ధాంతాలు, వైరం నుంచి వ్యక్తిగతంగా మారడం, అధికార పార్టీ నేతలు వారించకపోగా.. వారిని ప్రోత్సహించడం వంటి కారణాలతో చాలామంది తటస్థులు తప్పుపడుతున్నారు.

హై కమాండ్ తీరును గ్రహించిన కొడాలి నాని సైడ్ అయినట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి. పార్టీ పైన, అధినేతపైన చీమ వాలనివ్వకుండా చేయడంలో ముందు వరుసలో ఉండే నేతల్లో కొడాలి నాని ఒకరు. అందుకే మంత్రివర్గంలోకి జగన్ తీసుకున్నారు. కానీ విస్తరణలో మాత్రం తొలగించారు. క్యాబినెట్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉన్న.. కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రం విస్మరించారు. ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. తొలినాళ్లలో అధినేతపై ఉన్న అభిమానంతో కొడాలి నాని సైతం ఈ తరహా ప్రయత్నాలను పెద్దగా అడ్డుకోలేదు. పైగా సొంత సామాజిక వర్గాన్ని తూలనాడిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే కొడాలి నాని వాస్తవాలను గ్రహిస్తున్నారు. అనవసరంగా ప్రత్యర్థులపై నోరు పారేసుకుని తప్పు చేశానని మధనపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రత్యర్థులపై వీలైనంతవరకూ విమర్శల జోరు తగ్గించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.