Rashi Phalalu: ఈ రాశుల వారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు..12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?

వ్యాపారులకు ప్రతికూల సమయం. కొన్ని పనులు పూర్తి కావాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కష్టానికి తగిన ఫలితం లేక నిరాశ చెందుతారు.జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు.

Written By: Chai Muchhata, Updated On : November 23, 2023 10:05 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 23న గురువారం ద్వాదశ రాశులపై ఉత్తరభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వృషభం, మిథునం రాశుల వారికి శుభ ఫలితాలు సాగనున్నాయి. అలాగే 12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?

మేషరాశి:
పెండింగులో ఉన్న రుణాలను చెల్లిస్తారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు అనుకూల సమయం. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:
ఇంటికి చుట్టాలు రావొచ్చు. ఈ కారణంగా కొన్నిఖర్చులు ఉంటాయి. అయితే ఆదాయం మంచి పొజిషన్లో ఉంటుంది. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు.

మిథునం:
జీవితంలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అయి రిలాక్స్ అవుతారు. ఇతరులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మీ పని నచ్చక కొన్ని మాటలు అంటుంటారు.

సింహం:
వ్యాపారులు భాగస్వామిని ఎక్కువగా నమ్మోద్దు. సోదరులతో గొడవలకు దిగొద్దు. డబ్బు అప్పుగా ఇవ్వడానికి ముందుకు వస్తారు. బంధువులతో వాగ్వాదాలు ఉంటాయి.

కన్య:
వ్యాపారులకు ప్రతికూల సమయం. కొన్ని పనులు పూర్తి కావాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కష్టానికి తగిన ఫలితం లేక నిరాశ చెందుతారు.జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు.

తుల:
పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యులతో గొడవలకు దిగుతారు. వ్యాపారులు ప్రత్యర్థులను జయించడానికి కొత్త ప్రణాళికలు వేయాలి.

వృశ్చికం:
ఆదాయం లాభదాయకంగా ఉంటుంది. ఇతరులతో వాగ్వాదాలు ఉండొచ్చు. ఏ పనినైనా శ్రద్ధగా చేయాలి. పిల్లల నుంచి నిరుత్సాహకరమైన వార్తలు వింటారు.

ధనస్సు:
కొన్ని పనుల విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు వాయిదా పడొచ్చు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

మకరం:
ఉద్యోగులు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు దిగొద్దు. రాజకీయాయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూలం. అనవసర వాదనలు మంచిది కాదు.

కుంభం:
సోదరులకు సహాయం చేస్తారు. వ్యాపారులు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు.

మీనం:
పెండింగు పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రులకు సేవ చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండాలి.