Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి పతనం వెనుక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడా?

పెద్దిరెడ్డికి రాజకీయ శత్రువులు కూడా అధికం. మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలతో దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది.

Written By: Dharma, Updated On : August 2, 2023 1:17 pm

Peddireddy Ramachandra Reddy

Follow us on

Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీలో సీనియర్ మోస్ట్ మంత్రి. జగన్ కు ఇష్టమైన నాయకుడు. అందుకే మంత్రి వర్గ విస్తరణలో సైతం ఆయన పదవికి ఎటువంటి డొకా లేకుండా పోయింది. ఉమ్మడి చిత్తూరులోనే కాకుండా రాయలసీమలోనే బిగ్ షాట్ గా ఎదిగారు. చంద్రబాబుతో సరి సమానంగా ఆయనకు రాజకీయ అనుభవం ఉంది.

పెద్దిరెడ్డికి రాజకీయ శత్రువులు కూడా అధికం. మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలతో దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. తాజాగా కొంతమంది కొత్త శత్రువులు కూడా తెరపైకి వస్తున్నారు. భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన రామచంద్ర యాదవ్ ఆ జాబితాలోకి చేరారు. అయితే రామచంద్ర యాదవ్ వెనుకున్న వ్యక్తులు, వ్యవస్థలు ఎవరు? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా బిజెపి ప్రాధాన్యమిస్తున్నడంతో.. ఆ పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి పైనేఅందరి అనుమానం ఉంది.

పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం కొనసాగుతోంది. రోశయ్య తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పోస్ట్ ఇచ్చింది. ఇది ఇష్టం లేని పెద్దిరెడ్డి జగన్ గూటికి చేరారు. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి జగన్ వైపు మళ్ళించారు. ఆ కోపం కిరణ్ కుమార్ రెడ్డి లో ఉంది. కానీ పుంగనూరులో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఏం చేయలేకపోయారు. ఈ తరుణంలో రామచంద్ర యాదవ్ రూపంలో అవకాశందొరికింది. ఆయనకు బిజెపి తరఫున ప్రోత్సాహం ఇస్తే పెద్దిరెడ్డిని ఢీకొట్టవచ్చని కిరణ్ అంచనా వేసినట్లు తెలుస్తోంది. రామచంద్ర యాదవ్ వెనుక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు అనుమానాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి మరి.