KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ప్రత్యక్ష యుద్ధానికే నిర్ణయించుకున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రతిష్టనుమసకబారేలా చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. ఆయన పిలుపును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వాగతించారు బీజేపీ యేతర కూటమి కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాల కోసం ఆరా తీస్తున్నారు. ప్రాంతీయ పార్టీలతోనే మూడో కూటమి ఏర్పాటు చేస్తామని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో మరో శకానికి నాంది పలుకుతున్నట్లు ప్రకటిస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ లో భయం పట్టుకుంది. ఓటమి భయంతోనే కేసీఆర్ బీజేపీపై ప్రత్యక్ష పోరుకు ఆలోచించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీనే లక్ష్యంగా చేసుకుని మరీ దాన్ని అధికారంలోకి రానీయమని చెబుతున్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీని నిలువరించకుండా చేయాలనేదే టీఆర్ఎస్ ధ్యేయంగా కనిపిస్తోంది. దీని కోసమే అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానీయకుండా చేయాలనేదే ప్రణాళిక.
దీని కోసమే ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో బీజేపీని అడ్డుకోవాలనే చూస్తోంది. కానీ దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ఆపగలగడం అంత సులువైన పని కాదని తెలిసినా కేసీఆర్ మాత్రం తన ప్రయత్నాలు మానడం లేదు. దీని కోసం పలు రాష్ట్రాల్లో పర్యటించి వారి మద్దతు కూడా కూడగట్టినా ఇంతవరకు దానికి సంబంధించిన కార్యక్రమమేదీ వేదిక మీదకు రావడం లేదు. దీంతో కేసీఆర్ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ వేయబోయే ‘మంత్రం’ అదేనా?
ఇప్పటికే తమిళనాడు, కేరళ, బిహార్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల సీఎంలతో భేటీ అయి మూడో కూటమి బాధ్యతను గురించి చర్చించారు. మనందరం కలిస్తేనే కూటమి ఏర్పాటు సాధ్యమవుతుందని సూచించారు. దీనికి అందరు ఓకే చెప్పినా ఇంతవరకు దానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో ఎన్నికలు కూడా ఎంతో దూరంలో లేవు. సమయం కూడా తక్కువగానే ఉంది. కానీ కేసీఆర్ వ్యూహాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇంకా ఏం చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు.
మరోవైపు దేశంలో మూడో కూటమి అవసరం ఉన్నా దాన్ని ముందుకు నడిపించగల సత్తా గల నాయకుడే లేరు. దీంతోనే కాంగ్రెస్ ఆ ప్రయత్నాలు మానుకుంది. తమకు అంత సీన్ లేదని భావించే ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం ఏదో సాధిస్తానని కంకణం కట్టుకోవడం చూస్తుంటే అందరికి ఆశ్చర్యం వేస్తోంది. దేశంలోనే అధికారంలో ఉన్న పార్టీని ఓడించడం అంటే మాటలు కాదు. దానికి చాలా శ్రమ ఉండాలి. పటిష్టమైన నాయకత్వం ఉండాలి. కార్యకర్తల బలం ఎక్కువ కావాలి. ఇదంతా లేని కేసీఆర్ బీజేపీని ఎదుర్కోవాలని భావించడం చూస్తుంటే అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
Also Read: KCR vs BJP: రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న బీజేపీ ప్లాన్ లో కేసీఆర్ భాగమా?