Garikapati Narasimha Rao: ‘పుష్ప’ను అభిమానులు, సినీ ప్రముఖులే రాజకీయ నాయకులు కూడా బాగా మెచ్చుకుంటున్నారు. కానీ స్మగ్లర్ తగ్గేదేలే అంటాడా? అంటూ ‘పుష్ప’ సినిమా పై గరికపాటి ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు తాజాగా మండిపడ్డారు. ‘స్మగ్లర్‌ను హీరో చేశారు. చివర్లో 5 ని.లు మంచి చూపిస్తాం, పుష్ప-2 తీస్తాం అంటే నువ్వు తీసేలోపు సమాజం చెడిపోవాలా? స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే అంటాడా? ఇప్పుడది ఉపనిషత్తు సూక్తి అయిపోయింది.
ఈ డైలాగ్‌తో సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. దీనిపై హీరో, డైరెక్టర్‌ను సమాధానం చెప్పమనండి’ అని గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇదే డైలాగ్ ను బాగా వాడుకుంటున్నారు కూడా. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పుష్పరాజ్ డైలాగ్ ను ఎంచుకుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టిల్ ను ఎడిట్ చేసి బన్నీకి మాస్క్ పెట్టింది.
Also Read: ఐఐటీ తిరుపతిలో రూ.30 వేల వేతనంతో ఉద్యోగాలు.. బీటెక్ అర్హతతో?
ఈ ఎడిట్ చేసిన ఫొటోపై తగ్గేదేలే డైలాగ్ ను.. డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే.. అని రాసింది. ఏదైనా మాస్క్ తీసేదేలే అనే నినాదాన్ని ప్రజలలో తీసుకువెళ్ళడానికి ఈ రకంగా పుష్పను వాడుకున్నారు. ఏది ఏమైనా ఇదంతా బన్నీకి సంతోషాలను కలగజేసే అంశాలే. మొత్తమ్మీద ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఈ మధ్య తన రూట్ మార్చాడు.
ఇక నుంచి పాన్ ఇండియా సినిమాలను తలకెత్తుకుని ఆ ఇమేజ్ ను మెయింటైన్ చేస్తూ తనను తాను పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రమోట్ చేసుకోవాలని బన్నీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో గరికపాటి ఫైర్ అవ్వడం విశేషం అయింది.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.50,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు?