https://oktelugu.com/

టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి ఖాయమే..?

కేబినేట్ నుంచి బర్తరఫ్ కావడంతో ఎమ్మెల్యే, పార్టీ పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి వేటలో నాయకులు తలమునకలవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కౌశిక్ రెడ్డి గతంలోనూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే టికెట్ కన్ఫామ్ కోసం ఇన్ని రోజులు వేచి చూసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన టీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 11, 2021 / 10:01 AM IST
    Follow us on

    కేబినేట్ నుంచి బర్తరఫ్ కావడంతో ఎమ్మెల్యే, పార్టీ పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి వేటలో నాయకులు తలమునకలవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కౌశిక్ రెడ్డి గతంలోనూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే టికెట్ కన్ఫామ్ కోసం ఇన్ని రోజులు వేచి చూసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన టీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే తెలుస్తోంది.

    2018 ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. ఈటల రాజేందర్ చేతితో భారీ తేడాతో ఓడిపోయారు. అయితే అప్పటినుంచి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఈటల పరిణామాలతో ఆయన ప్రతిరోజు మీడియా ముందకు వచ్చారు. ఈటల అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఈటలపై విచారణ కోరడంతో తనను పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందని చర్చ జరిగింది.

    మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కోసం నాయకులు అన్వేషణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు టీడీపీ లీడర్ కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్ లోకి చేరారు. అయితే తనకు టికెట్ విషయంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో కశ్యప్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. ఇక కొన్ని రోజుల కిందట కమలాపూర్ గ్రామానికే చెందిన ఓ సీఐ పేరు వినిపించింది. విద్యావంతుడు, అధికారిని ఎన్నికల్లో ఉంచితే లాభిస్తుందని టీఆర్ఎస్ భావించింది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

    పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనకు కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ వచ్చే అవకాశం లేనట్లు తెలిసింది. దీంతో ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డికి ఇదివరకే కేటీఆర్ ను కలిశారు. ఆసమయంలో టికెట్ పైఎలాంటి హామీ ఇవ్వలేదు. తాజాగా టీఆర్ఎస్ నాయకులతో సమావేశం కావడంతో ఆయనకు టికెట్ వచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరి టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..