Homeఎంటర్టైన్మెంట్చరిత్ర పై విజయ్ దేవరకొండ కుతూహలం !

చరిత్ర పై విజయ్ దేవరకొండ కుతూహలం !

Vijay Devarakonda About Orugallu

విజయ్ దేవరకొండలో ఓ ప్రత్యేకత ఉంది. హీరో అంటే ఇలాగే ఉండాలి లాంటి పరిమితులను పెట్టుకోకపోవడమే అతని ప్రత్యేకత. నచ్చిన అంశం పై మనసు విప్పి హృదయ లోతుల్లో నుండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అతనికి మాత్రమే ఉన్న మరో క్వాలిటీ. ఇలాంటి లక్షణాలు ఉన్న హీరో తెలుగులో తక్కువ ఉన్నారు కాబట్టి, తక్కువ టైంలోనే క్రేజీ హీరోగా ఎదిగాడు విజయ్.

దానికి తోడు తనకు దక్కిన విజయాల స్థాయిని సినిమా సినిమాకి పెంచుకుంటూ.. పెరిగిన ఇమేజ్ ను నిలబెట్టుకుంటూ మొత్తానికి త్వరలోనే ప్యాన్ ఇండియా లెవల్‌ కు వెళ్లడానికి అన్ని రకాలుగా కసరత్తులు చేస్తున్నాడు ఈ ‘రౌడీ హీరో’. అయితే విజయ్‌ దేవరకొండ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. తనకు నచ్చిన వాటి పై తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ ఉంటాడు.

తాజాగా ఓరుగల్లు ఘనత మీద ఓ ట్వీట్ చేశాడు. ‘నాకు చరిత్ర గురించి ఎప్పుడూ తెలియని ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల నాటి చరిత్రగా, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తుగా నిలిచిపోయిన ‘రామప్ప గుడి’, నేటి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ విజయ్ దేవరకొండ ఓ మెసేజ్ చేశాడు. చారిత్రక ఘనత పై విజయ్ ఇలా స్పందించడం అందర్నీ ఆకట్టుకుంది.

ఇక అద్భుత శిల్ప సంపదతో కట్టిన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలవడం విశేషం. ఒకవేళ రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. మరి రామప్ప గుడి ఆ ఘనత సాధించాలని కోరుకుందాం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version