JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి రిటైర్మెంట్ అయినట్టేనా?

జేసీ దివాకర్ రెడ్డి వయస్సు 79 ఏళ్లు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు కంటే వయసులో పెద్ద. కానీ వారి కంటే ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారిగా గెలుపొందారు.

Written By: Dharma, Updated On : August 18, 2023 12:19 pm

JC Diwakar Reddy

Follow us on

JC Diwakar Reddy: ఏపీలో సీనియర్ మోస్ట్ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి. నాలుగు దశాబ్దాలుగా రాయలసీమ రాజకీయాల్లో కీరోల్ ప్లే చేశారు. ముఖ్యంగా అనంతపురంలో తన ముద్రను బలంగా చాటుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గాన్ని తన అడ్డాగా చేసుకున్నారు. ఎందుకో ఆయన ఇటీవల రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అది వయసు రీత్యా.. లేకుంటే వ్యూహాత్మకమా అన్నది తెలియాల్సి ఉంది. అటు అనంతపురం జిల్లాతో పాటు.. ఇటు మీడియాలో సైతం ఆయన ఆచూకీ కనిపించడం లేదు.

జేసీ దివాకర్ రెడ్డి వయస్సు 79 ఏళ్లు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు కంటే వయసులో పెద్ద. కానీ వారి కంటే ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారిగా గెలుపొందారు. తాడిపత్రి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.2014లో అనంతపురం ఎంపీగా నెగ్గారు. గత ఎన్నికల్లో కుమారుడిని బరిలో దించారు. కానీ ఓటమి ఎదురయ్యింది.

జెసి దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. తాడిపత్రి నియోజకవర్గం లో బలమైన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుమారుడిని బరిలో దించాలని భావిస్తున్నారు. అటు అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి దివాకర్ రెడ్డి కుమారుడు మరోసారి బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తుండడంతో జెసి వారసులు యాక్టివ్ అయ్యారు. కానీ ఈ తరుణంలో జేసీ దివాకర్ రెడ్డి జాడ లేకపోవడం కాస్తా లోటే.

ప్రస్తుతం దివాకర్ రెడ్డి వయసు 80 ఏళ్లు. ప్రభాకర్ రెడ్డి సైతం దాదాపు 77 సంవత్సరాలు ఉంటాయి. అందుకే గౌరవప్రదంగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ప్రత్యక్ష రాజకీయాలపై ఫోకస్ పెంచి.. తరువాత తప్పుకోవాలన్నది జేసీ సోదరుల భావన. అయితే గత కొంతకాలంగా జెసి దివాకర్ రెడ్డి జాడ కనిపించడం లేదు. ఆయన హైదరాబాద్ కె పరిమితమైనట్లు ప్రచారం జరుగుతోంది.వయసు దృష్ట్యా.. ఆయన బయటకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేనట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ది మోస్ట్ సీనియర్ లీడర్ జెసి దివాకర్ రెడ్డి రాజకీయంగా తెరమరుగైనట్టే.