https://oktelugu.com/

Chiranjeevi: భోళా శంకర్ నిర్మాతకు చిరంజీవి సాయం… ఎన్ని కోట్లు వదిలేశాడంటే!

చాలా ఏరియాల్లో నిర్మాత అనిల్ సుంకర భోళా శంకర్ ని సొంతగా విడుదల చేశారు. దాంతో నష్టాల తీవ్ర మరింత ఎక్కువగా ఉందని సమాచారం. మొత్తం ఆయనే భరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అనిల్ సుంకర అసెట్స్ అమ్మకానికి పెట్టారని కథనాలు వెలువడుతున్నాయి.

Written By:
  • Shiva
  • , Updated On : August 18, 2023 / 12:23 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: భోళా శంకర్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అన్ని ఏరియాల్లో భారీ నష్టాలు మిగిల్చింది. వరల్డ్ వైడ్ రూ. 79 కోట్లకు భోళా శంకర్ హక్కులు అమ్మారు. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ రావడంతో సాయంత్రానికి వసూళ్లు పడిపోయాయి. రెండో రోజే 70 శాతానికి పైగా వసూళ్లు తగ్గాయి. వీక్ డేస్ మొదలయ్యాక మొత్తంగా భోళా శంకర్ కుదేలైంది. భోళా శంకర్ బాక్సాఫీస్ రన్ దాదాపు ముగిసినట్లే. కేవలం రూ. 27 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ అందుకుంది. అంటే రూ. 52 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.

    చాలా ఏరియాల్లో నిర్మాత అనిల్ సుంకర భోళా శంకర్ ని సొంతగా విడుదల చేశారు. దాంతో నష్టాల తీవ్ర మరింత ఎక్కువగా ఉందని సమాచారం. మొత్తం ఆయనే భరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అనిల్ సుంకర అసెట్స్ అమ్మకానికి పెట్టారని కథనాలు వెలువడుతున్నాయి. భోళా శంకర్ ఇంతటి పరాజయం చూసినా చిరంజీవి ముక్కు పిండి తన రెమ్యునరేషన్ వసూలు చేశాడనే ప్రచారం జరిగింది.

    అయితే అందులో నిజం లేదని సమాచారం. వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిరంజీవి భోళా శంకర్ చిత్రానికి రూ. 60 నుండి 65 కోట్లు అడిగారట. ఈ మొత్తాన్ని నిర్మాత నుండి చిరంజీవి పైసా తగ్గించకుండా తీసుకున్నారని పుకార్లు వినిపించాయి. అయితే అవన్నీ అవాస్తవాలే. చిరంజీవి దాదాపు రూ. 10 కోట్లు వదిలేసినట్లు సమాచారం అందుతుంది. చిత్ర విడుదలకు ముందే చిరంజీవి రెమ్యూనరేషన్ చెల్లించిన అనిల్ సుంకర రూ. 10 కోట్లకు మాత్రం ముందు డేట్ వేసిన చెక్ ఇచ్చారట.

    అంటే ఆగస్టు 13, 14 తారీఖుల్లో డ్రా చేసుకునేలా తేదీ వేసిన చెక్ ఇచ్చారట. భోళా శంకర్ దారుణ పరాజయం నేపథ్యంలో ఈ పది కోట్ల చెక్ ని చిరంజీవి ప్రజెంట్ చేయకూడని నిర్ణయించుకున్నారట. కాబట్టి చిరంజీవి రూ. 10 కోట్లు వదిలేశారని టాలీవుడ్ వర్గాల టాక్. దర్శకుడు మెహర్ రమేష్ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కించారు.