Tollywood Heroines: అలనాటి సావిత్రి నుంచి.. ఇల నాటి శ్రీ లీల వరకు.. ‘ఎస్’ అంటే ఇండస్ట్రీ వీళ్లదే..

తెలుగువారికి మొదటి మహానటి ఎవరు అంటే అది సావిత్రి. సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్స్ లో ఇప్పటికీ.. ఎప్పటికీ మొదటి సూపర్ స్టార్ సావిత్రి

Written By: Swathi, Updated On : August 18, 2023 12:14 pm

Tollywood Heroines

Follow us on

Tollywood Heroines: సావిత్రి.. శ్రీ లీల…ఒక హీరోయిన్ మన అవ్వల కాలంలో ఏలిన హీరోయిన్ అయితే మరో హీరోయిన్ మన కాలంలో ఏలుతున్న నటి. వీరిద్దరికీ ఉన్న కామన్ పాయింట్ ఏమిటో చెప్పండి…మొదటి అక్షరం. ఇంగ్లీష్ ప్రకారం ఇద్దరి పేర్లు ఎస్ తో మొదలవుతాయి. అంతే కాదండి.. తరాలుగా మన తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్స్ ఎంతోమంది పేర్లు ఎస్ తోనే మొదలయ్యాయి…ఇది మీరు ఎప్పుడన్నా గమనించారా ? అవును ప్రతి తరంలో ఒక సూపర్ హిట్ హీరోయిన్ ఉంటుంది కదా…వారి పేర్లు ఎస్ తోనే మొదలవ్వడం గమనర్హం.. మరి అలా ఎస్ తో మొదలయ్యి టాలీవుడ్ ని ఏలిన హీరోయిన్లు ఎవరో చూద్దాం..

సావిత్రి

తెలుగువారికి మొదటి మహానటి ఎవరు అంటే అది సావిత్రి. సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్స్ లో ఇప్పటికీ.. ఎప్పటికీ మొదటి సూపర్ స్టార్ సావిత్రి నే.

శ్రీదేవి

అందం అనే పదానికి పర్యాయపదం శ్రీదేవి అని చెప్పొచ్చు. తెలుగువారికి మొదటి మహానటి సావిత్రి అయితే, మొదటి అతిలోక సుందరి మాత్రం శ్రీదేవి నే.

సౌందర్య

సావిత్రి తరువాత.. పద్ధతి అంతే గుర్తొచ్చే పేరు సౌందర్య. ఒక దశాబ్దం పాటు తెలుగు ప్రేక్షకులను ఎన్నో సినిమాలతో మెప్పిచ్చి టాప్ హీరోయిన్ గా నిలబడింది.

సిమ్రాన్

యాక్టింగ్ అయినా …‌డాన్స్ అయినా.. 90లో వారికి హీరోయిన్ అంటే సిమ్రాన్. తన అందం ..డాన్స్.. ఇక అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ హీరోయిన్.

శ్రియ

శ్రియ నటించన తెలుగు హీరో లేదేమో.. దాదాపు 23 సంవత్సరాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది శ్రియ.

సమంత

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే మాయ చేసి పడేసింది సమంత. ఇక అప్పటినుంచి.. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఆమె మాయలోనే ఉన్నారు.

సాయి పల్లవి

హీరోయిన్స్ కి ఎక్స్పోజింగ్ అవసరం లేదు.. కేవలం నటనతో ప్రేక్షకులను ఫిదా చేయొచ్చు అని రుజువు చేసింది సాయి పల్లవి.

శ్రీ లీల

ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరోయిన్ శ్రీ లీల. డజన్ సినిమాలు సైన్ చేసి తెలుగులో దూసుకుపోతోంది. ముఖ్యంగా సావిత్రి లాగా శ్రీ లీల
కూడా మన తెలుగు అమ్మాయి కావడం విశేషం.