
Badvel Bypoll: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో సంచలన రీతిలో పోలింగ్ నమోదైంది. ఎన్నికకు టీడీపీ, జనసేన దూరంగా ఉన్నా వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు సాగింది. దీంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని అందరు భావించారు. కానీ రికార్డు స్తాయిలో 68.12 శాతం నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. పోలింగ్ శాతం పెరగడానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలు దూరంగా ఇంత భారీ స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాజకీయ కోణంలో చూస్తే పలు విషయాలు అర్థమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం పోటీ నుంచి తప్పుకున్నా ఇంత పెద్ద పోలింగ్ శాతం నమోదు కావడం అందరిలో ఆశ్చర్యం పెంచుతోంది. అసలు రాష్ర్టంలో ఏం జరుగుతోందనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ప్రాధాన్యం తగ్గిపోతోందా? అధికార పార్టీ వైసీపీ ప్రభావం పెరుగుతోందా? అనే అంశాలు అందరిలో మెదులుతున్నాయి. బీజేపీకి జనసేన భాగస్వామ్య పార్టీ అయినా ఎక్కడ కూడా ప్రచారం చేయకపోవడంతో వారి ఓట్లు ఎటు వైపు పడ్డాయో తెలియడం లేదు. దీంతో బీజేపీకి ప్లస్ అవుతుందో లేదో తేలాల్సి ఉంది.
2019 ఎన్నికల్లో టీడీపీ 32 శాతం ఓట్లు సాధించింది. ఈ సారి ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో ఆ ఓట్లు ఎటు పోలయ్యాయి. ఎవరికి లాబం చేకూరింది అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. దీంతో ప్రజల్లో కూడా ఇదే విషయంపై ఆసక్తి పెరుగుతోంది. బద్వేల్ లో వైసీపీకి లాభం కలిగిందా? లేక బీజేపీకి చేకూరిందా అనే చర్చలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
బద్వేల్ ఉప ఎన్నికలో ఓటరు ఎటు వైపు మొగ్గుతాడో తేలాల్సి ఉంది. ఈ ఎన్నికలో వైసీపీకి మెజార్టీ పెరిగితే టీడీపీ నష్టమే. దాని ఓటు బ్యాంకు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీలో ఆందోళన నెలకొంది. మొత్తానికి బద్వేల్ లో కూడా ఓటరు నాడి ఎవరికి అంతుచిక్కకుండా ఉంది. అన్ని విషయాలు తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Also Read: నేటితో హుజూరాబాద్, బద్వేలు ప్రచారానికి తెర.. హోరా హోరీ
బీజేపీ మాట ఎత్తకుండా విశాఖ కార్మికుల వెంట నిలబడ్డ పవన్ కళ్యాణ్