Drugs Mafia: రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ నియంత్రణ చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందుకుగాను రాష్ట్రంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దాని మూలాల మాత్రం హైదరాబాద్ లో ఉండటం గమనార్హం. దీంతో సర్కారు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ మాఫియాను సమూలంగా నాశనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. పటిష్ట యంత్రాంగాన్ని తయారు చేస్తోంది. డ్రగ్స్ కేసులో ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని సూచిస్తున్నారు. ఎవరి ప్రమేయం లేకుండా ఎక్కడ ఎవరు పట్టుబడినా వారిపై చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

డ్రగ్స్ మాఫియాతో రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోంది. గతంలో కూడా డ్రగ్స్ కేసును ఛేదించిన పోలీసులను తప్పించారు.దీంతో డ్రగ్స్ మాఫియా మళ్లీ జడలు విప్పింది. విచ్చలవిడిగా రవాణా అవుతోంది. సాక్షాత్తు హైదరాబాద్ లోనే పలుమార్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడం విశేషం. దీంతో ఎక్కడో కాదు మన భాగ్యనగరంలోనే డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు సర్కారు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈసారి డ్రగ్స్ రవాణా చేసే వారిని అణచివేయాలని ఆలోచిస్తున్నారు.
Also Read: దేశంలో వేతనాల పెరుగుదల.. ఎంత శాతమంటే?
ఈ కేసుల్లో ఎంతటి వారికైనా శిక్షలు తప్పవు. రాజకీయ నేతలైనా, ఉన్నతాధికారులైనా విడిచిపెట్టకూడదని చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో తప్పులు దొర్లితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపైనే మచ్చ పడుతోంది. దీని నివారణకు ప్రభుత్వం సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు విషయాలపై చర్చ సాగింది. డ్రగ్స్ కేసుల్లో ఎవరు తలదూర్చొద్దని హితవు పలికారు. ఎవరికైనా శిక్షలు ఖరారు చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు.
దేశంలో నార్కోటిక్ డ్రగ్స్ వాడకం పెరిగిపోతోంది. దీంతో దాని మూలాలు దెబ్బతీసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో డ్రగ్స్ ఎక్కడి నుంచి రవాణా అవుతోంది? దానికి బాధ్యులెవరు? ఎవరి ఆధీనంలో డ్రగ్స్ నిర్వహణ సాగుతోంది అనే విషయాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఎంతటి వారైనా డ్రగ్స్ కేసులో దొరికితే కటాకటాలకు పంపాల్సిందే. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.
Also Read: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. త్వరలోనే మళ్లీ మునపటి పరిస్థితులు..