https://oktelugu.com/

‘బాయ్ కాట్’ చైనా సాధ్యమేనా?

అమెరికాకు చెందిన యాపిల్ ఐఫోన్ ధర దాదాపు 96వేలపైనే ఉంటుంది. కొన్ని లక్ష దాటి ఉంటాయి. అదే ఫీచర్లతో అంతే కాన్ఫిగరేషన్ తో చైనా దేశపు ఫోన్లు 25లోపే అటూ ఇటూగా దొరుకుతాయి. అందుకే ఎంఐ, వన్ ప్లస్ లాంటి అద్భుతమైన ఫీచర్ల ఫోన్లు ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లో ఇలా రిలీజ్ కాగానే భారతీయులు ఎగబడి కొంటున్నారు. ఇటీవల భారత్-చైనా ఘర్షణలతో 20 మంది భారత సైనికులను చంపిన చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని అందరూ ‘బాయ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 22, 2020 7:00 pm
    Follow us on


    అమెరికాకు చెందిన యాపిల్ ఐఫోన్ ధర దాదాపు 96వేలపైనే ఉంటుంది. కొన్ని లక్ష దాటి ఉంటాయి. అదే ఫీచర్లతో అంతే కాన్ఫిగరేషన్ తో చైనా దేశపు ఫోన్లు 25లోపే అటూ ఇటూగా దొరుకుతాయి. అందుకే ఎంఐ, వన్ ప్లస్ లాంటి అద్భుతమైన ఫీచర్ల ఫోన్లు ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లో ఇలా రిలీజ్ కాగానే భారతీయులు ఎగబడి కొంటున్నారు. ఇటీవల భారత్-చైనా ఘర్షణలతో 20 మంది భారత సైనికులను చంపిన చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని అందరూ ‘బాయ్ కాట్ చైనా వస్తువులు ’ అంటున్నారు. కానీ తాజాగా 20మంది భారత సైనికులు చనిపోయిన తరువాత కూడా చైనా మొబైల్ కంపెనీ ‘వన్ ప్లస్ 8ప్రో’ భారత మార్కెట్లో ఆన్ లైన్ లో అద్భుత ఫీచర్లతో ఫోన్ విడుదల చేసింది. ఈ స్టాక్ మొత్తాన్ని మన భారతీయులు ఎగబడి కొనేశారు. ఇక దేశభక్తి ఎక్కడిది అని సగట వాదులు ప్రశ్నిస్తున్నారు.

    ప్రజలు ఊగిపోతున్నారు. రాజకీయ పార్టీ నేతలు గొంతెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ చైనా’ వస్తువులంటూ పెద్ద ప్రచారమే జరుగుతోంది. ఇంతకీ చైనా వస్తువుల నిషేధం దేశంలో సాధ్యమేనా? అత్యంత చీప్ గా దొరికే ఈ వస్తువులను ఇన్నాళ్లు భారతీయులే ఎగబడి కొన్నారు.

    మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

    భారత్ లోని అన్ని కుటుంబాల్లో చైనా చీప్ వస్తువులు ఉన్నాయి. అమెరికా, జపాన్ తదితర క్వాలిటీ ప్రోడక్టుల కంటే చైనా వస్తువులు చాలా చీప్. అందుకే చైనా ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతూ నడిచేనన్ని రోజులు నడిపిస్తూ ఆ తర్వాత భారతీయులు పారేస్తున్నారు.

    ఇక మన గొంతెత్తే రాజకీయ నేతలందరూ ముందుగా చైనా నుంచి దిగుమతులే నిషేధిస్తే భారతీయులు ఎవరూ కొనరు కదా.. కానీ అది సాధ్యం కాదని వారికి కూడా తెలుసు. ఎందుకంటే చైనా వస్తువులను నిషేధిస్తే అంతకు పదింతలు ఖరీదైన వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఆ ఆర్థిక భారం ప్రభుత్వం, ప్రజలు భరించలేరు. పైగా ఇప్పటికిప్పుడు చైనా వస్తువులను భారత్ లో అంత చీప్ గా తయారు చేయడం కుదరదు. అందుకే దేశభక్తి ఎంత ఉప్పొంగినా.. భారత్ లో ‘బాయ్ కాట్ చైనా’ వస్తువుల నిషేధం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు.

    ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!

    చైనా ఉత్పత్తులను బహిష్కరించడం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే భారత ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. చైనా కూడా మనకు ఎగుమతులు బంద్ చేస్తే భారత్ కే నష్టం అంటున్నారు.

    చైనా ఎగుమతుల్లో భారతదేశం వాటా కేవలం 3 శాతం మాత్రమే. అదే క్రమంలో చైనా నుండి 70 బిలియన్ డాలర్ల వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకుంటోంది. 60 శాతం ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇందులో ఉన్నాయి. భారత్ కు మూడవ అతిపెద్ద మార్కెట్ గమ్యస్థానంగా చైనా ఉంది. చైనా నుండి 67 శాతం ఫార్మా ముడిపదార్థాల దిగుమతులు భారత్ కు మందుల తయారీలో ఎంతో లాభం చేకూరుస్తున్నాయి. మన ఎగుమతులు తక్కువ.. దిగుమతులే ఎక్కువ. అందుకే చైనా నుంచి ఒక్కసారిగా దిగుమతులు బంద్ చేస్తే ఆర్థికంగా భారత్ కే నష్టం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సో దేశభక్తి కోణంలో చైనా వస్తువుల బాయ్ కాట్ నిజమే. అందరూ చేయాల్సిందే.

    కానీ ఆర్థిక వ్యవస్థ కోణంలో మన నిస్సహాయత మన పారిశ్రామిక ఉత్పత్తి లోపాలను తాజాగా ఘటనలు నిరూపిస్తున్నాయి. అన్ని వస్తువులను మనం తయారు చేసి స్వావలంబన సాధించాలన్న వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.. మన వస్తువులన్నీ మనం ఉత్పత్తి చేసినప్పుడే ‘బాయ్ కాట్ చైనా ’ వస్తువులను చేయగలం.

    -ఎన్నం