https://oktelugu.com/

రిజర్వేషన్లు ఇవ్వడం సముచితమేనా?

ప్రతిభే కొలమానం. అసలు ఈ ప్రతిభ పుట్టుకతోనే వస్తుందని ఒప్పుకుంటున్నప్పుడు, పుట్టడమే ఫలానా కులంలో పుడుతున్నప్పుడు కులం ఎందుకు కొలమానంగా పరిగణించరాదు? మేం పట్టుదలతో సాధించాం అనేవాళ్లుంటారు. అలాంటివాళ్లు వూరిబయట కులాల్లో పుట్టి, కూలినాలి చేసుకుని బ్రతికే తల్లిదండ్రులచేత పోషింపబడి, అవమానాలు, వివక్షలచేత పెంచబడి, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లలో పెరిగి, ప్రభుత్వ స్కూళ్లలో చదివి పోటీపడాలి. దాన్ని ప్రతిభ అంటారు. చివరిదీ, దాదాపు రిజర్వేషన్ వ్యతిరేకించే ప్రతి అడ్డగాడిదా చేసే వాదన ఏమంటే “మా కివన్నీ తెలియదు, […]

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2021 4:16 pm
    Follow us on

    ప్రతిభే కొలమానం. అసలు ఈ ప్రతిభ పుట్టుకతోనే వస్తుందని ఒప్పుకుంటున్నప్పుడు, పుట్టడమే ఫలానా కులంలో పుడుతున్నప్పుడు కులం ఎందుకు కొలమానంగా పరిగణించరాదు?

    మేం పట్టుదలతో సాధించాం అనేవాళ్లుంటారు. అలాంటివాళ్లు వూరిబయట కులాల్లో పుట్టి, కూలినాలి చేసుకుని బ్రతికే తల్లిదండ్రులచేత పోషింపబడి, అవమానాలు, వివక్షలచేత పెంచబడి, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లలో పెరిగి, ప్రభుత్వ స్కూళ్లలో చదివి పోటీపడాలి. దాన్ని ప్రతిభ అంటారు.

    చివరిదీ, దాదాపు రిజర్వేషన్ వ్యతిరేకించే ప్రతి అడ్డగాడిదా చేసే వాదన ఏమంటే “మా కివన్నీ తెలియదు, మేమట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీగా పుట్టలేదు, కనీసం మా బ్రతుకుతప్ప మరో బ్రతుకు అర్థంకాని వింత జంతువులం మేము, ప్రతిభనే కొలమానంగా వుండాలి!” రైట్, బావుంది.

    సరిహద్దుల్లో తిష్టవేసుకుని చైనావాడు కూర్చున్నాడు, నాకు బలం వుంది కాబట్టి నీ దేశాన్ని ఆక్రమిస్తాను. రోడ్డుమీద పోలీసువద్ద లాఠీ వుంది నీకు రెండు వడ్డిస్తాను. నావద్ద వైద్యం వుంది ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకుంటాను, నేను ఇష్టమొచ్చిన రేటుకు పెట్రోలు అమ్ముకుంటాను… ఏం, అదివాడి ప్రతిభ కాదా? ఎందుకు తప్పనిపిస్తోంది? న్యాయం లేదనిపిస్తోంది?

    నాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిర్మించిన తెల్లవాడు అదే మాట అన్నాడని ఒప్పుకున్నావా? నాకు తెలివి వుంది, శక్తివుంది కాబట్టి ఆక్రమించానంటే అంగీకరించావా?

    స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నావే? మరి ఆ కులాలకు, ఆ రాజ్యంలో ప్రాతినిధ్యం లేనప్పుడు వాళ్లకు అది స్వరాజ్యం ఎట్లైతది? ఇది 80శాతం కిందికులాలున్న దేశంలో ప్రతిభ, తెలివి అంటూ వారికి విద్యా ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకుండా చేస్తే అది పరాయి పాలన కాదా? ఈ దేశం కిందికులాల్ది కాదా? మరి వారికి ప్రాతినిధ్యం లేకుండా చేసిన చేసిన అగ్రకులపోళ్లు, రిజర్వేషన్ వద్దనే కనీస బుద్దిలేని వెధవలంతా దేశం వదలిపోవడం ఉత్తమం కాదా? వదిలేదాకా ఉద్యమించడం అభ్యుదయవాదుల కర్తవ్యం కాదా?

    నిజానికి మెజారిటీ కులాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు మైనారిటీ కులాలాలైన అగ్రవర్ణాలకు కొంత రిజర్వేషన్ ఇవ్వడం సముచితం, ఇది రివర్స్‌లో వుండడం ఈ తలకిందులుగా వుండే వ్యవస్థకు శాపం.

    -సిద్ధార్థి సుభాష్