China-Pakistan: భారత్ రక్షణ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా దాయాది దేశాలను ఎదుర్కొనే క్రమంలో పాటించే వ్యూహాలకు పదును పెడుతోంది. ఎదుటి వారి శక్తిని నిర్వీర్యం చేసే చర్యలకు ఉపక్రమిస్తోంది. దీని కోసం ఎంత వ్యయమైనా చేసేందుకు వెనకాడటం లేదు. ఇన్నాళ్లు విర్రవీగిన డ్రాగన్, పాక్ ను కట్టడి చేసేందుకు కొత్త రకం ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 ట్రయాంప్ ఆయుధాలను కొనుగోలు చేసి శత్రుదేశాలకు సవాలు విసురుతోంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుని శత్రు దుర్బేద్యంగా తయారవుతోంది.

ఎస్-400 ట్రయాంప్ సామర్థ్యంతో శత్రు దేశాలను ఆందోళనలకు గురిచేస్తోంది. డ్రాగన్ తన వద్ద ఉన్న ఆయుధాలతో భారత్ భయపెట్టాలని చూసింది. కానీ ప్రస్తుతం తీసుకొచ్చిన ఆయుధాలతో ఇక చైనా సైతం భయపడే సూచనలు కనిపిస్తన్నాయి. పాకిస్తాన్ అయితే ఇక మన జోలికి వస్తే అంతే సంగతి. దాని అంతు చూడాల్సిందే అని భావిస్తోంది.
600 కిలోమీటర్ల దూరంలోని విమానాలు, రాకెట్లను గుర్తించి 400 కిలోమీటర్ల దూరంలోనే కూల్చేయగల సామర్థ్యం వీటికి ఉంది. దీంతో వీటి కొనుగోలుకు భారత్ మొగ్గు చూపింది. 2018లోనే వీటిని కొనుగోలు చేసినా అవి అందుబాటులోకి రావడానికి సమయం పట్టింది. ఈ నేపథ్యంలో డ్రాగన్ ఆధిపత్యానికి చెక్ పెట్టినట్లు అయింది.
Also Read: నాని ఛాలెంజ్ ను స్వీకరించే దమ్ము బీజేపీకి ఉందా?
గగనతల రక్షణలో భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందివచ్చే ఏ అవకాశాన్ని చేజార్చుకోకుండా వినియోగించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే ఎస్-400 ఆయుధాలు కొనుగోలు చేసి దాయాది దేశాలకు హెచ్చరికలు పంపుతోంది. దీంతో అటు పాకిస్తాన్, ఇటు డ్రాగన్ యుక్తులను చిత్తులు చేయడమే మన లక్ష్యంగా కనిపిస్తోంది.
అయితే ప్రతి దానికి బలం, బలహీనతలు ఉంటాయనేది సత్యమే. ఎస్-400కు సైతం కొన్ని బలహీనతలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా తొలుత దీన్ని ఎస్ -300 వినియోగించినా అది సత్ఫలితాలు ఇవ్వలేదని సమాచారం. దీంతోనే దాన్ని ఆధునీకరించి ఎస్ -400గా తీసుకొచ్చారు. రక్షణ వ్యవస్థలో దీన్ని ఆధునిక ఆయుధంగానే చెబుతున్నా దీన్ని వినియోగిస్తేనే దాని బలం మనకు తెలుస్తుందని నిపుణుల అంచనా.
Also Read: అయితే రేవంత్ రెడ్డి.. లేదంటే జగ్గారెడ్డి?