Telangana: ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం.. సమస్త పార్టీల్లో అసంతృప్తులదే సర్వస్వం రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేరసే యంత్రాంగంలా మారిపోతోంది. నైతిక విలువలు లేకుండా పోతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఎంత కాలం ఉంటారో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల భవితవ్యం కూడా రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వివిధ పార్టీలు తమ ఎజెండాలను పక్కన పెట్టి సొంత జెండాలే అమలు చేస్తున్నాయి.

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ మూడోసారి అధికార పీఠం దక్కించుకోవాలని తాపత్రయపడుతోంది బీజేపీ కూడా బలమైన శక్తిగానే ఎదుగుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ అయితే తన ఉనికి ఇంకా ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఏ కార్యక్రమం తీసుకోకుండా జనంలోకి వెళ్లకుండా కాలం వెళ్లదీస్తోంది. దీంతో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియడం లేదు.
Also Read: మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇద్దరి మధ్య గ్యాప్
అన్ని పార్టీల్లో అసమ్మతి రాగమే వినబడుతోంది. తమకు టికెట్ రాకపోతే అంతే సంగతి పార్టీ మారేందుకు కూడా వెనకాడటం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి కచ్చితమైన మెజార్టీ వస్తుందో తెలియడం లేదు. దీంతో రాష్ర్టంలో రాజకీయ వేడి రగులుకుంటోంది. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు తమ ప్రభావం చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. తమ పార్టీయే అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నాయి.
భవిష్యత్ లో రాష్ట్రంలో ద్విముఖ పోటీ ఉంటుదని భావిస్తున్నారు. కానీ బీఎస్పీలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరడంతో దాని మీద కూడా కొందరి దృష్టి నెలకొంది. మరోవైపు షర్మిల కూడా రాష్ట్రంలో తన పాత్ర పోషించాలని భావిస్తున్న తరుణంలో పోటీ ఏ మేరకు చూపుతారో తెలియడం లేదు. మొత్తానికి రాష్ర్టంలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెబుతున్నారు. కానీ అప్పటికి ఏ మలుపులు తిరుగుతాయో అర్థం కావడం లేదు.
Also Read: ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి.. అభివృద్ధి పంచాయితీ వేళ కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా!
[…] Teenmar Mallanna: బీజేపీలో కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న ఆ పార్టీకి దూరమవుతున్నాడా..? ఆయనకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతోనే కమలం పార్టీని వీడయేందుకు రెడీ అవుతున్నారా..? గతంలో మాదిరిగా సొంతంగా తన అనుచరవర్గంతో ప్రభుత్వంపై ముప్పేట విమర్శలు చేసేందుకు రెడీ అవుతున్నారా..? అంటే కొన్నిపరిస్థితులను బట్టి అవుననే సమాధానం వస్తోంది. జర్నలిస్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అధికార టీఆర్ఎస్ పార్టీకి కంట్లో నలుసుగా మారాడు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఆధారాలతో సహా తన యూట్యూబ్ ఛానెల్ లో ఎత్తిచూపేవాడు. ఈ క్రమంలో అధికార పార్టీ ఆగ్రహానికి గురై కొన్ని కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లాడు. ఆ సమయంలో బీజేపీ నాయకులు సహకరించారు. మొత్తానికి బెయిల్ పై బయటకొచ్చిన మల్లన్న బీజేపీలో చేరారు. కానీ కొంత కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లనని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. […]