Chinna Jeeyar Swamy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామిని పట్టించుకోవడం లేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తన పేరు లేదనే కారణంతో ఆయన జీయర్ స్వామిని పక్కన పెట్టేశారు. దీంతో కేసీఆర్ కోసం శాంతి యాగం కూడా వాయిదా వేసుకున్న జీయర్ స్వామికి నిరాశే ఎదురైంది. యాగానికి రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపినా ఆయన రాలేదు. దీంతో జీయర్ స్వామి చేసేది లేక యాగం నిర్వహించారు.

ఎంతటి వారినైనా ఒకసారి వద్దనుకుంటే కేసీఆర్ పక్కన పెట్టడం తెలిసిందే. దీనికి జీయర్ స్వామి మాత్రం మినహాయింపు కాదు. కేసీఆర్ కు వచ్చిన ఆగ్రహానికి జీయర్ స్వామి వివరణ కూడా ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ సమాచార లోపం వల్ల తప్పు జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం కరగలేదు. జీయర్ స్వామిపై ఆగ్రహం తగ్గించుకోలేదు. ఫలితంగా యాగానికి వెళ్లలేదు.

దీంతో యాదాద్రి పనుల్లో కూడా జీయర్ స్వామికి ప్రవేశం లేకుండా చేసినట్లు తెలుస్తోంది. ఇకపై యాదాద్రికి చిన్న జీయర్ స్వామిని రానివ్వరనే వాదన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో ఏదో చిన్నపొరపాటుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని అందరు చర్చించుకుంటున్నారు. కానీ ఇందులో వేరే కోణం కూడా ఉందని అనుమానాలు వస్తున్నాయి.
Also Read: CM KCR-Chinna Jeeyar: పేరు లేదనే అలకబూనిన కేసీఆర్ః వివరణ ఇచ్చిన జీయర్ స్వామి
అసలు ప్రధానమంత్రి మోడీని ఆహ్వానించడమే కేసీఆర్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీతో సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో ప్రధాని విగ్రహావిష్కరణకు రావడం కేసీఆర్ కు సుతారాము ఇష్టం లేదు. దీంతో తనకు గిట్టని వారితో ఆవిష్కరణ చేయించుకున్నందుకే కేసీఆర్ జీయర్ స్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదిఏమైనా ఓ భక్తి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేసి తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. అందరిని కలుపుకుని పోయే సీఎం ఇలా వ్యక్తిగత ఉద్దేశాలు ఆపాదిస్తూ అందరిని దూరం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాల్సింది పోయి చిన్నతనంగా చేయడం సమంజసం కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
Also Read: జాతీయ రాజకీయాల కోసం ఈసారి ఎంపీగా పోటీ చేయనున్న కేసీఆర్ !?
Recommended Video:
[…] Also Read: చినజీయర్ స్వామి చివరి ఆశా నిరాశేనా? […]
[…] Also Read: చినజీయర్ స్వామి చివరి ఆశా నిరాశేనా? […]
[…] Read: చినజీయర్ స్వామి చివరి ఆశా నిరాశేనా? బంగారం రేటుపై వేర్వేరు అంశాలు […]