అనేక దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా చైనా వ్యాక్సిన్లు పనిచేయడం లేదని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. కొత్త వేరియంట్లపై చైనా వ్యాక్సిన్లు పనిచేయడం లేదని ఆ రిపోర్టుల్లో తెలిపారు. వ్యాక్సిన్లు పనిచేస్తే కరోనా కేసులు ఎందుకు పెరుగుతాయని హాంకాంగ్ వర్సిటీ వైరాలజిస్టు డాంగ్ యాన్ తెలిపారు.
మహమ్మారిని అడ్డుకునే క్రమంలో వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచ దేశాలు గుర్తించాయి. చైనాకు చెందిన సైనోఫార్మ్ వ్యాక్సిన్ కు 78 శాతం సామర్థ్యం ఉంది. సైనోవాక్ టీకాకు 51 శాతం మాత్రమే సామర్థ్యం మాత్రమే ఉన్నట్లు తేల్చారు. చైనా టీకాలను 90 దేశాలు వాడుతున్నాయి. డ్రాగన్ టీకాలు తీసుకున్న మంగోలియాలో 2400 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
వ్యాక్సిన్లు వేసుకోవడంతో కేసులు పెరగడానికి ఏమిటి సంబంధం అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంటోంది. మహమ్మారిని కట్టడి చేయడంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కనీస స్థాయికి చేరాలని డబ్ల్యూ హెచ్ వో చెప్పింది. కేసుల సంఖ్య పెరిగిన షీషెల్స్, మంగోలియా దేశాలు మాత్రం సైనోఫామ్ టీకా పని చేస్తున్నట్లు చెబుతున్నాయి. ఇండోనేషియాలో కొత్త వేరియంట్ పుట్టుకొస్తుంది. బహ్రాన్, యూఏఈ దేశాల్లో సైనోఫార్మ్ టీకా తీసుకున్న వారు సైతం కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.