చైనా భయపడిందా..చర్చలకు దిగొస్తోందా.. కారణమదే?

భారత్‌–చైనాల మధ్య రోజురోజుకూ ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రం అవుతున్నాయి. చైనాకు భారత్‌ ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం ఇస్తూనే ఉంది. తాజాగా పెద్ద ఎత్తున చైనా యాప్స్‌ పై నిషేధించింది. ఎప్పుడు యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. చైనా మన ఇంచు భూభాగాన్ని ఆక్రమించినా ఊరుకునేది లేదంటూ భారత్‌ ఇప్పటికే హెచ్చరించింది కూడా. అయినా చైనా ఏదో ఒక కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ఎలాగైనా గట్టి బుద్ధి చెప్పాలని భారత్‌లో బార్డర్‌‌లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. […]

Written By: NARESH, Updated On : September 4, 2020 3:07 pm
Follow us on


భారత్‌–చైనాల మధ్య రోజురోజుకూ ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రం అవుతున్నాయి. చైనాకు భారత్‌ ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం ఇస్తూనే ఉంది. తాజాగా పెద్ద ఎత్తున చైనా యాప్స్‌ పై నిషేధించింది. ఎప్పుడు యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. చైనా మన ఇంచు భూభాగాన్ని ఆక్రమించినా ఊరుకునేది లేదంటూ భారత్‌ ఇప్పటికే హెచ్చరించింది కూడా. అయినా చైనా ఏదో ఒక కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ఎలాగైనా గట్టి బుద్ధి చెప్పాలని భారత్‌లో బార్డర్‌‌లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. దీంతో దిగొచ్చిన చైనా ఎట్టకేలకు చర్చలకు దిగుతోంది.

Also Read : షకీల్‌ ‘తారక’మంత్రం..ఈ‌ రాజకీయం వర్కవుట్ కాలే..!

భారత్‌ ఇస్తున్న దీటైన జవాబుకు భయపడిపోయిన చైనా దిగొచ్చింది. మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా చైనా రక్షణ శాఖ మంత్రి వే ఫెంఝీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపారు. ఈ మేరకు భారత దౌత్యాధికారులకు చైనా ప్రతినిధులు సమాచారం కూడా అందజేశారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇది శుభ పరిణామంగా అందరూ భావిస్తున్నారు. కానీ.. చైనా ప్రతిపాదనపై ఇప్పటివరకైతే భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. కానీ.. ఈ సమావేశానికి కేంద్రం కూడా సమ్మతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌–చైనా సరిహద్దు వివాదాలు కేవలం దౌత్యపరంగానే పరిష్కారం అవుతాయని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా నుంచి భేటీ ప్రతిపాదన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గతనెల 29 అర్ధరాత్రి పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు డ్రాగన్‌ విఫలయత్నం చేయడంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. అప్రమత్తమైన భారత్‌.. చైనా ఎత్తును చిత్తు చేసేందుకు పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవు భాగంగా ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌‌–4 పర్వాతాలు చైనా కబ్జాలో పడిపోయాయి. అయితే.. ఆ ఫింగర్‌‌ ప్రాంతంలోనూ ఇతర పర్వత శిఖరాలను ఆకస్మికంగా తన అధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి పెంచింది. తద్వారా భవిష్యత్తులో చర్చలు జరిపేటప్పుడు భారత్‌కు అనుకూల పరిస్థితి ఉంటుందని సైనిక వర్గాలు తెలిపాయి. ఒకవేళ చర్చలకు ఇరుదేశాలు సంసిద్ధమైతే బార్డర్‌‌లో సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని అనుకోవచ్చు.

Also Read : టాలీవుడ్ సినీ రాజకీయం: సాయం హీరోది.. బొక్క నిర్మాతకీ..!