ఆడ లేక మద్దెల ఓడు అనేది సామెత. ఓటమిని జీర్ణించుకోలేని వారు తమ పరాజయానికి కారణాలు వేరే చూపుతూ కాలం వెళ్లబుచ్చుతుంటారు. కింద పడినా, మీద పడినా మాదే పైచేయి అనే వారుంటారు. సహజంగా ఓటమి చెందిన తరువాత ఎవరైనా మాట్లాడకుండా సైలెంట్ గా మారిపోతారు. వైసీపీ ఏకపక్ష విజయాలతో ముందుకు పోతున్నా టీడీపీ మాత్రం రెట్టించిన శబ్ధంతో విరుచుకుపడుతుందే కానీ మౌనం పాటించడం లేదు.
2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో విజయం సాధించినప్పుడు టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. టీడీపీ సైలెంట్ అయిపోతుంది అని భావించారు. జగన్ చేతిలో వరుస ఓటములను తెలుగుదేశం లైట్ గా తీసుకుంటోంది. ఓడినా బెబ్బులిలా జగన్ మీద విరుచుకుపడుతోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని తేల్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతామని బుకాయించింది బ్యాలెట్ పేపర్ పెడితే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. కానీ లోకల్ ఎన్నికల్లో సైతం వెనుకంజ వేసింది.
లోకల్ బాడీ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. అయినా వైసీపీ దౌర్జన్యం చేసిందని కొత్త పాట అందుకుంది. తిరుపతి ఎన్నికలో దొంగ నోట్లు పడ్డాయని ఆరోపణలు చేసింది. మరి మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితం కూడా వైసీపీకే అనుకూలంగా వచ్చింది. దీంతో టీడీపీ మరో మూడేళ్లు నిశ్శబ్ధంగా ఉంటుందని భావించారు. వైసీపీ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. తిరుపతి ఎన్నికలో ఘోర ఓటమి తరువాత కూడా టీడీపీ ఎక్కడా తగ్గలేదు.
జగన్ విషయంలో తెలుగుదేశం తేలిగ్గా తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నిక్లల్లో వైసీపీ గల్లంతు కావడం ఖాయమనే ధీమాగా ఉన్నారు. జగన్ మీద ఉన్న సీబీఐ కేసులు, ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలు, కరోనా వంటి వ్యవహారాలతో జగన్ మీద కత్తి మీదసాములా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని టీడీపీ భావిస్తోంది. 2024లో టీడీపీని ఓడిస్తేనే జగన్ విజయానికి సంపూర్ణత రాదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.