https://oktelugu.com/

జమిలిపై బీజేపీ దూకుడు

బయట ప్రచారం జరుగుతున్నట్లుగా కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోందా..? ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందా..? ఓ వైపు ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తూనే.. రాజకీయ పార్టీలకు సందేశం ఇస్తున్నట్లే కనిపిస్తోంది. మొదటగా ప్రధాని నోట జమిలీ ఎన్నికల మాట వచ్చింది. దాంతో అందరూ అలర్ట్ అయ్యారు. Also Read: బీజేపీ ఆకర్ష్.. ‘మై హూనా’ అంటున్న రాములమ్మ..! దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని.. ఒకే దేశం– ఒకే ఎన్నిక అనేది అత్యంత ఆవశ్యకమని […]

Written By: , Updated On : December 27, 2020 / 03:06 PM IST
Follow us on

BJP
బయట ప్రచారం జరుగుతున్నట్లుగా కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోందా..? ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందా..? ఓ వైపు ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తూనే.. రాజకీయ పార్టీలకు సందేశం ఇస్తున్నట్లే కనిపిస్తోంది. మొదటగా ప్రధాని నోట జమిలీ ఎన్నికల మాట వచ్చింది. దాంతో అందరూ అలర్ట్ అయ్యారు.

Also Read: బీజేపీ ఆకర్ష్.. ‘మై హూనా’ అంటున్న రాములమ్మ..!

దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని.. ఒకే దేశం– ఒకే ఎన్నిక అనేది అత్యంత ఆవశ్యకమని మోడీ చెబుతున్నారు. ఈ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బీజేపీ నేతలు. వరుసగా వారం రోజులపాటు వెబినార్లు నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు.. ప్రముఖులతో ఈ వెబినార్లు జరుగబోతున్నాయి.

ఇప్పటికే హస్తిన కేంద్రంగా రైతులు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై రైతుల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని బీజేపీ ప్రధాన టాస్క్‌. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు అదే బిజీలో ఉన్నారు కూడా. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతులతో మాట్లాడుతున్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీ జమిలీ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. రైతు అంశంతో పాటు జమిలీ ఎన్నికలకు తాము అనుకున్నట్లుగా ముందుకెళ్లడం చాలా కీలకమని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే.. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.

Also Read: వైసీపీ, బీజేపీలు టీడీపీని టార్గెట్‌ చేశాయట..

ఇప్పటికే జమిలి ఎన్నికలు తప్పవంటూ ప్రధాని సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో తాము సైతం రెడీగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పకనే చెప్పింది. జమిలీ ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగ పరంగా ఎలాంటి సవరణలు చేయాలో ఇప్పటికే లా కమిషన్ తో సహా నివేదిక సమర్పించింది. వాటికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు కూడా సిద్ధమైనట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే 2022లోనే జమిలీ ఎన్నికలు ఉండవచ్చనేది జరుగుతున్న ప్రచారం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్