https://oktelugu.com/

గ్రేటర్లో మళ్లీ ఎన్నికలు.. అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం..!

జీహెచ్ఎంసీ-2020 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. డిసెంబర్ 4నే గ్రేటర్ ఫలితాలు వెల్లడైనప్పటికీ నేటికి మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందనేది సస్పెన్స్ గానే  కొనసాగుతూనే ఉంది. Also Read: జమిలిపై బీజేపీ దూకుడు గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి హంగ్ ఏర్పడింది. టీఆర్ఎస్ 56.. బీజేపీకి 48.. ఎంఐఎం కు 44.. కాంగ్రెస్ కు కేవలం రెండు సీట్లు దక్కాయి. గ్రేటర్ ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు టీఆర్ఎస్.. ఎంఐఎం ఒకటేనని విమర్శలు గుప్పించి విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 27, 2020 / 03:14 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ-2020 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. డిసెంబర్ 4నే గ్రేటర్ ఫలితాలు వెల్లడైనప్పటికీ నేటికి మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందనేది సస్పెన్స్ గానే  కొనసాగుతూనే ఉంది.

    Also Read: జమిలిపై బీజేపీ దూకుడు

    గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి హంగ్ ఏర్పడింది. టీఆర్ఎస్ 56.. బీజేపీకి 48.. ఎంఐఎం కు 44.. కాంగ్రెస్ కు కేవలం రెండు సీట్లు దక్కాయి. గ్రేటర్ ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు టీఆర్ఎస్.. ఎంఐఎం ఒకటేనని విమర్శలు గుప్పించి విజయం సాధించారు.

    ప్రస్తుతం తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు టీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో ఓట్లను కలుపుకున్నప్పటికీ మేయర్ పీఠం దక్కించుకోలేని పరిస్థితి లేదు. దీంతో మేయఠ్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.

    బీజేపీ.. ఎంఐఎంకు చెందిన కొంతమంది కార్పొరేటర్లను టీఆర్ఎస్ తనవైపు ఆకర్షిస్తే మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఆ పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ వైపు వచ్చేలా కన్పించడం లేదని తెలుస్తోంది.దీంతో టీఆర్ఎస్ స్పెషల్ పాలన వైపు మొగ్గుచూపుతుందనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: జగిత్యాలలో కి‘లేడీ’

    కొన్నిరోజులు హైదరాబాద్లో స్పెషల్ పాలన విధించి పరిస్థితులు చక్కబడ్డ తర్వాత టీఆర్ఎస్ ఎన్నికలు వెళుతుందనే టాక్ విన్పిస్తోంది. అయితే టీఆర్ఎస్ స్పెషల్ పాలన వైపు మొగ్గుచూపుతుందా? లేదా మేయర్ పీఠం దక్కించుకునేందుకు మరేదైనా వ్యూహాలు రచిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

    ప్రస్తుత పాలవర్గానికి మరో నెలన్నర గడువు ఉండటంతో టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే ఉత్కంఠత నెలకొంది. కేసీఆర్ వ్యూహం ఏంటో ఎవరికీ అంతుచిక్కకపోవడంతో మేయర్ విషయంలో టీఆర్ఎస్ ఎలా ముందుకెళుతుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్