https://oktelugu.com/

జగిత్యాలలో కి‘లేడీ’

ఏ మొగాడైనా ఆడవారి అందానికి ఫిదా అయిపోతూ ఉంటారు. అలాంటి అందగత్తె ఒకామె మగాళ్లను టార్గెట్‌ చేసింది. తన అందంతో ఆకట్టుకుంటూ ట్రాప్‌లో పడేస్తూ నిలువునా దోచుకోవడం చేసింది. ఆమె శరీరం సౌష్టవం అయినా.. ఆమె బుర్ర మాత్రం క్రిమినల్‌. అందుకే తన బాహ్య సౌందర్యాన్ని ఎరగా వేసి.. క్రిమినల్ బుర్రతో దోచుకోవడం ప్రారంభించింది. ఈ దోపిడీ కూడా ఎంత స్మార్ట్‌గా అంటే.. ఆ దోపిడీని విన్న ఎవరైనా ‘వాహ్‌ ఏం స్కెచ్‌రా బాబు’ అని అనాల్సిందే. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 27, 2020 / 03:00 PM IST
    Follow us on

    ఏ మొగాడైనా ఆడవారి అందానికి ఫిదా అయిపోతూ ఉంటారు. అలాంటి అందగత్తె ఒకామె మగాళ్లను టార్గెట్‌ చేసింది. తన అందంతో ఆకట్టుకుంటూ ట్రాప్‌లో పడేస్తూ నిలువునా దోచుకోవడం చేసింది. ఆమె శరీరం సౌష్టవం అయినా.. ఆమె బుర్ర మాత్రం క్రిమినల్‌. అందుకే తన బాహ్య సౌందర్యాన్ని ఎరగా వేసి.. క్రిమినల్ బుర్రతో దోచుకోవడం ప్రారంభించింది. ఈ దోపిడీ కూడా ఎంత స్మార్ట్‌గా అంటే.. ఆ దోపిడీని విన్న ఎవరైనా ‘వాహ్‌ ఏం స్కెచ్‌రా బాబు’ అని అనాల్సిందే. అలా అని ఆమె టార్గెట్‌ చిన్నచిన్న వారు మాత్రం కాదు. మంచి బిగ్‌షాట్సే. అందులోనూ రాజకీయ నేతలనే ఆమె మెయిన్‌ టార్గెట్‌. అయితే.. ఆమె చేతిలో మోసపోయిన వారంతా పరువు పోతుందని సైలెంట్ గా ఉన్నవారే ఎక్కువ. అతికొద్ది మంది మాత్రం బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. ఆమెను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు.

    Also Read: బీజేపీ ఆకర్ష్.. ‘మై హూనా’ అంటున్న రాములమ్మ..!

    ఈ తతంగం అంతా జరిగింది ఎక్కడో కాదు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌‌ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల జిల్లాలోనే. బాగా డబ్బున్న మగవారితో పరిచయాలు పెంచుకోవడం.. శారీరకంగా దగ్గరవడం వంటి పనులతో ఓ మహిళ వీఐపీ వర్గాల్లో కొంత కాలంపాటు హాట్ టాపిక్ అయ్యారు. అయితే.. ఆమె తన వలలో పడినవారితో శారీరక సంబంధాలను కొనసాగిస్తూ రహస్యంగా వీడియో తీయించేది. ఆమె తమ అందానికి.. తమ పలుకుబడి దాసోహం అయి శారీరక సుఖం పొందడానికి వచ్చిందన్న భ్రమలో ఉండే మగవాళ్లు దీన్ని గుర్తించలేకపోయారు. తమ ఫోన్‌కి ఆ రాసలీలల క్లిప్ వచ్చిన తర్వాతే వారికి లైట్ వెలిగేది. అలా పెద్ద ఎత్తువ మగవాళ్లను మోసం చేసింది ఈ కి‘లేడీ’.

    అంతేకాదు.. తన మోసాలను కంటిన్యూ చేసేందుకు ఓ ముఠాను సైతం ఏర్పరుచుకుంది. స్పష్టంగా తన రాసలీలల దృశ్యాలను తీయడానికి ఇద్దరు కెమెరామెన్లను నియమించుకుంది. ఇలా.. కొంత మంది రాజకీయ నేతలతోపాటు.. పలువురు ప్రముఖ వ్యాపారులను బెదిరించి లక్షల్లో వసూలు చేసినట్లుగా సమాచారం. అయితే.. ఏ పాపం అయినా ఎప్పటికైనా పండాల్సిందే కదా. ఆమె చేతిలో మోసపోయిన కొందరు చివరికి తమ పేరు బయటకు రాకుండా బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి వారిని అరెస్ట్ చేశారు.

    Also Read: ఏపీ బీజేపీకి అస్త్రంగా రాజాసింగ్‌

    మొత్తం 8 మందిని ఈ కిలాడీ తన శరీరాన్ని ఎరగా వేసి మోసం చేసిన‌ట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ ప్రకటించారు. మ‌గ‌వారు గుర్తు తెలియని మహిళలతో సన్నిహితంగా ఉండవద్దని ఆమె సలహా ఇస్తున్నారు. మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బలహీనతలను కంట్రోల్ చేసుకోకపోతే.. మోసపోవడం మగవాళ్ల వంతు అవుతుందనేది మరోసారి స్పష్టమైంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్