Film industry: తెలుగు సినీ పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా సినిమాల టికెట్ల విషయంలో రోజుకో రూల్ తెస్తూ నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అయినా ఎవరు కూడా పెదవి విప్పని పరిస్థితి. జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నోరు విప్పితే ఆయనపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారబోబోంది. సినిమా టికెట్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఓ చట్టాన్ని ఆమోదించడంతో ఇక ఏపీలో బెనిఫిట్ షోలు ఉండవని తెలుస్తోంది. కేవలం నాలుగు ఆటలకే పర్మిషన్ ఉంటుంది. దీంతో నిర్మాతల పరిస్థితి అధ్వానంగా మారనుంది.
సినిమా వాళ్లు ప్రజల్ని దోచుకుంటున్నారనే ఉద్దేశంతోనే ఇలా కట్టడి చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. పెద్ద సినిమాల పరిస్థితి మరీ దారుణంగా మారనుంది. అసెంబ్లీలో కూడా సినిమా పరిశ్రమపై చర్చలు జరుగుతున్నా నిర్మాతలకు మాత్రం ప్రయోజనం చేకూరే విధంగా చట్టాలు ఉండటం లేదు. దీంతో భవిష్యత్తులో సినిమాలు నిర్మించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోనుందని తెలుస్తోంది.
సినిమాలు విడుదలైన తొలినాళ్లలోనే లాబాల పరంపర కొనసాగడం తెలిసిందే. కానీ ప్రభుత్వ నిర్ణయంతో వసూళ్లు వెక్కిరించే పరిస్థితే కనబడుతోంది. మీడియా సంస్థలపై కూడా ప్రభుత్వం దుష్ర్పచారం చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో నిర్మాతలకు మింగుడు పడటం లేదు. బిల్లు ఆమోదంతో పెద్ద సినిమాలకు గడ్డు పరిస్థితి తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Tollywood Herohines:ఈ హీరోయిన్ల రియల్ ఫేస్ లుచూస్తే కిందపడిపోతారు..!
స్టార్ హీరోల సినిమాల విషయంలో కూడా బిల్లు తో కష్టాలే కలగనున్నాయి. తొలి రెండు వారాల్లోనే టికెట్ల రేట్లు పెంచుకుని కలెక్షన్లు రాబట్టుకోవాలని చూస్తాయి. కానీ ప్రభుత్వ నిర్ణయంతో వాటి మనుగడ గందరగోళంలో పడినట్లే. ప్రజలు థియేటర్లకు వచ్చినా లాబాలు మాత్రం శూన్యమే. దీంతో బడ్జెట్ పెట్టినా ప్రయోజనాలు దక్కకపోతే నిర్మాతల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిర్మాతల విషయంలో ఆలోచించి బిల్లు నిర్ణయంపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సినిమా నిపుణులు చెబుతున్నారు.
Also Read: Jr NTR: ఎన్టీఆర్ ఆశ నెరవేరుతుందా ? లేదా ?