Balakrishna: నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చంద్రబాబు అరెస్టు తరువాత బాలకృష్ణ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. రకరకాల కామెంట్స్ తో వైసీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో వైసీపీ నేతలు సైతం బాలకృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని.. గతంలో ఆయనకు మెంటల్ సర్టిఫికెట్ జారీ చేశారని గుర్తు చేస్తూ.. ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే టాపిక్ వైరల్ అవుతోంది. ఇంతకీ బాలకృష్ణకు మెంటల్ ఏనా? ఆయనకు గతంలో ఆసుపత్రి సర్టిఫికెట్ జారీ చేసిందా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బాలకృష్ణ ఓ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లో ఓ నిర్మాత పై కాల్పులు జరిపారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. వరుసగా జరిగిన ఈ ఘటనలు అప్పట్లో పెను రాజకీయ దుమారానికి దారి తీసాయి. అయితే అప్పట్లో బాలకృష్ణ కేసులో ఇరుక్కోకుండా అప్పటి ప్రభుత్వం సాయం చేసిందన్న టాక్ ఇప్పటికీ వినిపిస్తుంది. కేసును డైవర్ట్ చేసేందుకు బాలకృష్ణకి అప్పట్లో మెంటల్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ప్రచారం ఉంది. ఇప్పుడు అదే వైరల్ అవుతోంది.
గత కొన్నాళ్లుగా వైసీపీ నేతలు నాటి ఘటనలు గుర్తు చేస్తూ వచ్చారు. కొద్దిరోజుల కిందట మంత్రి జోగి రమేష్ సైతం ఈ ఘటనను గుర్తు చేశారు. బాలకృష్ణ ఎగిరెగిరి పడకు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి నువ్వు రుణపడి ఉన్నావు అంటూ విరుచుకుపడ్డారు. అటు తరువాత సైతం బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రతి సమయంలోనూ సైతం ఆయన మానసిక పరిస్థితి.. అప్పటి కేసుల ఉదాంతం బయటకు వస్తూనే ఉంది.
తాజాగా చంద్రబాబు అరెస్ట్ తో బాలకృష్ణ వైసీపీ నేతలపై విరుచుకుపడుతూ వస్తున్నారు. బావ చంద్రబాబుపై అభిమానంతో తనదైన రీతిలో వైసిపి నేతలపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఈ తరుణంలో అప్పట్లో బాలకృష్ణకి ఇచ్చిన మానసిక స్థితి కి సంబంధించి ఎర్రగడ్డ ఆసుపత్రి జారీచేసిన సర్టిఫికెట్ ఇది అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ శ్రేణులు ఈ వీడియోను ట్రోల్ చేస్తున్నాయి. బాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అంటూ కామెంట్స్ చేస్తున్నాయి. తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
బాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి అనర్హుడు…. మెంటల్ సర్టిఫికెట్ చూపించి కోర్టు లో కేసు వేస్తే ఎమ్మెల్యే పదవి రద్దు అవ్వుతుంది pic.twitter.com/K7FTckYmSi
— Anitha Reddy (@Anithareddyatp) October 4, 2023