AAP: అమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తోంది. ఢిల్లీ నుంచి మెల్లగా పంజాబ్ లో పాగా వేయాలని భావిస్తోంది. మచ్చలేని పాలన, అవినీతి రహితం అమ్ ఆద్మీకి కలిసి వచ్చే అంశాలు. దేశంలో అన్ని పార్టీలకు ఎంతో కొంత అవినీతి చీడ అంటుకుంది. ఈ నేపథ్యంలో అమ్ ఆద్మీ తన వ్యూహాలను ఖరారు చేసుకుని దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళికలు వస్తోంది. ఇందులో భాగంగానే పంజాబ్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే క్రమంలో ముందుకు కదులుతోంది. రెండు జాతీయ పార్టీల్లో ఉన్న అనైక్యతను సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీ బోణీ కొట్టింది. అదే ఊపుతో ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది. జాతీయ పార్టీల్లో ఉన్న అనైక్యతను ఉపయోగించుకుని తద్వారా అధికారం హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీకి బలమైన కేడర్ ఉండటంతో కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది.
బీజేపీపై పంజాబ్ రైతులంతా ఆగ్రహంతో ఉన్నారు. రైతు చట్టాల నేపథ్యంలో వారంతా బీజేపీని విశ్వసించడం లేదు. ఈ అవకాశాన్ని అమ్ ఆద్మీ క్యాష్ చేసుకోవాలని ఆలోచిస్తోంది. మరోవైపు బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్ కూడా దూరమైంది. దీంతో ఎలాగైనా పంజాబ్ లో పాగా వేయాలని అమ్ ఆద్మీ చీఫ్ అరవింద కేజ్రీవాల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.
పంజాబ్ లో ఉన్న స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకుని ఓట్లు సంపాదించాలని అమ్ ఆద్మీ పార్టీ చూస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని స్టేట్లలో మాదిరి ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతున్న క్రమంలో పంజాబ్ లో కూడా వాటితో జతకట్టి తామనుకున్న లక్ష్యం నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ గా నైనా ఉండాలని తలపిస్తోంది.