IRCTC: రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా కవరేజీ పొందే అవకాశం కల్పించింది. ఈ పథకం ఎప్పటి నుంచో అమలులో ఉంది. కానీ, దీనిగురించి చాలా మందికి తెలియదు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) తన కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇందులో బీమా ప్రీమియం ప్రయాణికుడికి 45 పైసలుగా నిర్ణయించింది. రైలు ప్రయాణం చేసేవారికి ఇది తప్పనిసరి. ఈ పథకం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ టికెట్ల ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులు మాత్రమే పొందుతారు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి…
ఈ బీమా ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే. అయితే విదేశీయులు, ఏజెంట్లు లేదా ఇతర ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ సౌకర్యం పొందలేదు. ఇక సీటు లేకుండా టికెట్ బుక్ చేసుకునే 5 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలను కూడా ఈ పాలసీలో చేర్చలేదు. కానీ, 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలు టికెట్ బుక్ చేసుకుంటే ఈ బీమా వర్తిస్తుంది.
బీమా వర్తింపు ఇలా..
బీమాను సమ్ అష్యూర్డ్, బెనిఫిట్‌స, ఇన్సూరెన్స్ పాలసీ కింద బీమా డబ్బులు నాలుగు వర్గాలుగా విభజించారు.
మృతదేహం తరలింపు.. రైలు ప్రమాదం లేదా ఇతర సంఘటనల తర్వాత మృతదేహాన్ని తరలించడానికి రూ.10,000 వరకు బీమా ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
గాయం కోసం హాస్పిటల్ ఖర్చులు.. ఈ ప్లాన్‌లో రైలు ప్రమాదంలో గాయాలు అయినప్పుడు ఆస్పత్రిలో చేరే ఖర్చుల కోసం రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందవచ్చు.
పాక్షిక వైకల్యం.. ఈ బీమా ప్రయోజనంలో 75 శాతం పాక్షిక వైకల్యానికి అందిస్తారు. అంటే రూ.7,50,000 వరకు ఉంటుంది.
శాశ్వత వైకల్యం..
ప్రమాదం జరిగినప్పుడు శాశ్వతంగా వైకల్యం చెందితే 100 శాతం బీమా అందుతుంది. రూ.10 లక్షలు పొందవచ్చు.
మరణం.. ఇక ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరనిస్తే నామినీకి బీమా మొత్తం అందుతుంది. రూ.10 లక్షలు ఇస్తారు.
బీమా పొందడం ఇలా..
రైల్వే టికెట్ బుక్ చేసుకున్నపుపడు ఈ మెయిల్ ద్వారా ప్రయాణికుడికి బీమా సమాచారం అందుతుంది. ప్రయాణికులు వారి టికెట్ బుకింగ్‌లో పాలసీ నంబర్, ఇతర సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చు. బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసిన తర్వాత నామినీ వివరాలు పూరించాలి. నామినేషన్ సమాచారం నింపకపతే క్లెయిమ్ విషయంలో చట్టపరమైన వారసులకు చెల్లింపు ఉంటుంది. బీమా పాలసీ ధ్రువీకరించిన ఆర్‌ఏసీ(రిజరేవషన్ ఏజంట్ కన్సల్టేషన్) టికెట్ హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణంలో ప్రమాదాలు లేదా అనుకోని ఘటనలు జరిగితేనే పాలసీని పొందుతారు.