Naveen Murder Case : ఇటీవల ముక్కోణపు ప్రేమ కథలు వస్తున్నాయి. దీంతో అచ్చం సినిమా కథల్లా ఒకమ్మాయిని ఇద్దరబ్బాయిలు ప్రేమించిన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా స్టోరీల్లా ఎన్నో కథలు మన కళ్లకు కడుతూనే ఉన్నాయి. ప్రేమకు ఎందరో అద్భుతమైన నిర్వచనం చెప్పారు. ప్రియురాలి సుఖం కోసం జీవితాలను త్యాగం చేసిన వారు కూడా ఉన్నారు. కానీ ప్రియురాలు దక్కదనే ఉద్దేశంతో స్నేహితుడినే హతమార్చిన ఘటన సంచలనం కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రేమలో స్వార్థమే కనిపిస్తోంది.
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నేనావత్ నవీన్ (20), హరహరకృష్ణ నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు స్నేహితులు అయ్యారు. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి నాదంటే నాదని ఇద్దరు శత్రువులుగా మారారు. ఈ నేపథ్యంలో హరి పథకం వేశాడు. నవీన్ ఉంటే ఆమె తనకు దక్కదనే ఉద్దేశంతో అతడిని అంతమొందించాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా హత్య కోసం ప్లాన్ చేశాడు. తన గదిలో పార్టీ చేసుకుందామని అబ్దుల్లాపూర్ మెట్ కు రప్పించాడు. ఇద్దరు కలిసి మద్యం తాగారు. బాగా తాగిన తరువాత ఇద్దరి మధ్య ప్రియురాలి విషయమై మరోమారు గొడవ రాజకుంది. దీంతో ముందస్తు ప్లాన్ ప్రకారం హరి నవీన్ ను కొట్టి చంపాడు. అనంతరం అతడి మర్మాంగాన్ని కోసి గుండెను చీల్చి ప్రియురాలికి ఫొటోలు తీసి పంపాడు. వేళ్లు కట్ చేశాడు. మెడను తొలగించాడు. ఇలా కిరాతకంగా చంపిన సైకో హరహరకృష్ణ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది.చంపేసిన అనంతరం పోలీస్ స్టేషన్ లో హరహరకృష్ణ లొంగిపోయాడు. నవీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రియురాలు కోసం స్నేహితుడినే మట్టుబెట్టిన ఘటన సంచలనం కలిగిస్తోంది.
స్నేహానికన్న మిన్న లేకాన లేదురా అన్నారో సినీకవి. కానీ ప్రస్తుతం స్వార్థమే అందరిని పక్కదారి పట్టిస్తోంది. తమ దారికి అడ్డొస్తే స్నేహితుడైనా ఫర్వాలేదు హత్య చేయాల్సిందే. ఇలా కుట్ర కోణాలతో హత్యలకు దారి తీస్తున్న పరిస్థితులపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ వారసులు ఇలా ఒక అమ్మాయి చేయరాని పనులు చేయడంతో భయపడుతున్నారు. భవిష్యత్ లో వీరు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులుగా మారతారో తెలియడం లేదు.