Russia- International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కాలం చెల్లిందా? అది సక్రమంగా పనిచేయడం లేదా? పరికరాలు, యంత్రాలకు కాలం చెల్లాయా? ఇక ఎంత మాత్రం అది పనికి రాదా? పైగా రోబో మాదిరిగా వినాశకారిగా పరిణమిస్తుందా? అంటే రష్యా నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి రష్యా అనేక కారణాలు చూపుతోంది. అయితే రష్యా వ్యతిరేక దేశాలు మాత్రం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకునే క్రమంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వదిలించుకునేందుకే రష్యా ఇటువంటి అబండాలు వేస్తోందని అనుమానిస్తున్నాయి. చైనాతో కలిసి సొంతగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుచేసుకునే పనిలో ఉన్న రష్యా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. కొద్దిరోజుల్లో పనులు కొలిక్కి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో ఉన్న సంబంధాలను వదులుకోవాలని చూస్తోంది. అదే సమయంలో అంతరిక్ష కేంద్రంలో మిగతా భాగస్వామ్య దేశాలతో మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతోంది. ఈ పరిణామ క్రమంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ పరిశోధన కేంద్రం చరిత్రను మసకబరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీనిపై రష్యా వ్యతిరేక దేశాలు మాత్రం మండిపడుతున్నాయి.

యుద్ధంతో వాయిస్ మార్చిన అగ్ర రాజ్యం…
ఉక్రెయన్ తో యుద్ధం తరువాత రష్యా వాయిస్ మారింది. అటు దేశ భద్రతకు పెద్దపీట వేస్తూ పుతిన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ను బరితం బలోపేతం చేయాలని భావించారు. చీఫ్ గా సమర్థుడిగా పేరుగాంచిన యూరి బొరిసోవ్ ను నియమించారు. అటు మిత్ర దేశమైన చైనాతో సొంతంగా అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటుచేసుకుంటున్నారు. ఉక్రెయిన్ తో యుద్ధ క్రమంలో అగ్ర దేశం అమెరికాతో రష్యాకు సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ అంతరిక్ష పరిశోధన ఏర్పాటు విషయంలో మాత్రం అమెరికా సహకారమందిస్తోంది. అయితే తాజాగా రాస్ కాస్మోస్ చీప్ బొరిసొవ్ వ్యాఖ్యలు మాత్రం ప్రపంచానికే భయం గొల్పుతున్నాయి. అంతరిక్షంలో పరిభ్రమిస్తూ అనేక పరిశోధనలకు వేదికగా నిలుస్తున్న, కీలక సమాచారాన్ని సేకరించి భూమికి పంపిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై ఆయన కీలక వ్యాఖ్యానాలు దుమారం రేపుతున్నాయి.
Also Read: China Rice Plants Zero-Gravity: చైనా చేసిన అద్భుతం.. అంతరిక్షంలో అన్నదానం సక్సెస్

ఎగిరే ప్రయోగ శాలపై కీలక వ్యాఖ్యలు..
ఎగిరే ప్రయోగ శాలగా ఉన్న ఐఎస్ఎస్ లో సిబ్బంది భద్రతకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ అన్ని వ్యవస్థలు పాడయ్యాయని.. పరికరాలు, యంత్రాలకు కాలం చెల్లిందని కూడా చెప్పుకొచ్చారు. సాంకేతికంగా ఐఎస్ఎస్ అన్ని భద్రతా గడువులు దాటిపోయిందని.. ఏదో రోజు మంచు తుఫాను విరుచుకుపడినట్టు..దానిలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోవడం ఖాయమని కూడా తేల్చిచెప్పారు. ఐఎస్ఎస్ లోని అన్ని వ్యవస్థలు ఒక రోజు మొరాయిస్తాయని కూడా జోష్యం చెప్పారు. భవిష్యత్ లో ప్రమాదకరిగా మారనుందని కూడా హెచ్చరించారు. అదే సమయంలో తాము సొంతంగా రూపొందిస్తున్న అంతరిక్ష కేంద్రం ప్రత్యేకతలను చెప్పుకొచ్చారు. ధ్రువాలను కలుపుతూ భూమిని చుట్టుకొస్తుందని.. రష్యాకు అవసరమైన సమాచారం చేరవేస్తుందని..అటు ప్రపంచ దేశాలకు సహాయకారిగా ఉంటుందని చెప్పారు.అంతర్జాతీయ రేడియో ధార్మికతకు సంబంధించి నూతన సమాచారాన్ని సేకరిస్తుందని కూడా వెల్లడించారు. మొత్తానికి అటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా.. ఇటు సొంత అంతరిక్ష కేంద్రం గొప్పదనం చాటేలా బొరిసొవ్ వ్యాఖ్యానించడం ప్రపంచంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నిజా నిజాలు ఎంత అని తెలుసుకునే పనిలో నిపుణులు ఉన్నారు.
Also Read:Aadhaar Card Themed Ganesh pandal: దేవుడికే ఆధార్ కార్డు ఇచ్చేశారు
[…] […]