Homeఅంతర్జాతీయంRussia Ukraine War: భారత్‌పై స్పేస్ స్టేషన్ కూలొచ్చు.. మీరు సిద్ధమేనా.. రోస్ కాస్మోస్ చీఫ్...

Russia Ukraine War: భారత్‌పై స్పేస్ స్టేషన్ కూలొచ్చు.. మీరు సిద్ధమేనా.. రోస్ కాస్మోస్ చీఫ్ షాకింగ్ కామెంట్స్..

Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ చీఫ్ సీరియస్ అయ్యారు. అమెరికా కొత్తగా ఆంక్షలు విధించిందని, దీని వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం‌పై ఇరు దేశాల సహకారం దెబ్బతినే చాన్స్ ఉందని ఆయన తెలిపారు. దీనివల్ల స్పేస్ స్టేషన్ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఫలితంగా అమెరికా, భారత్, ఐరోపా, చైనా వంటి దేశాల‌పై అది పడొచ్చని హెచ్చరించారు.

Russia Ukraine War
chief of roscosmos

రష్యాపై ఐఎస్ఎస్ తిరగదని పేర్కొన్నారు. అందువల్ల తమ దేశానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సైనిక చర్యలకు పాల్పడిన రష్యాను శిక్షించేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తాజాగా కొత్త ఆంక్షలు ప్రకటించింది. రష్యాకు సాంకేతిక, అంతరిక్ష, సైనిక రంగాల్లో పరస్పర సహకారంపై కొన్ని షరతులు విధించారు. రష్యా బ్యాంకులు, ఆ దేశానికి సహకరించే వ్యక్తులు, సంస్థల‌పైనూ అమెరికా ఆంక్షలు విధించింది.

Also Read:   ఉక్రెయిన్‌ లోని భారతీయుల పై సోనూసూద్ ట్వీట్

దీని ఫలితంగా రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ డిమిత్రి రోగోజిన్స్ స్పందించారు. తతెత్తబోయే ప్రమాదాలను హెచ్చరిస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. మీరు మా సహకారాన్ని అడ్డుకుంటున్నారు. స్పేస్ స్టేషన్ తన కక్ష్య నుంచి తప్పిపోయే ప్రమాదముంది. అమెరికా లేదా ఐరోపా‌పై అది పడిపోతే ఎవరు కాపాడుతారో చెప్పాలని ప్రశ్నించారు. సుమారు 500 టన్నుల బరువైన అంతరిక్ష కేంద్రం భాగాలు భారత్ లేదా చైనా‌పై పడే చాన్స్ ఉందని పేర్కొన్నారు.

Russia Ukraine War
Russia Ukraine War

ఇటువంటి పరిస్థితుల్లోనూ మీరు బెదిరించాలనుకుంటున్నారా? అంటూ అమెరికాను ప్రశ్నించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం స్పందించింది. కొత్త ఆంక్షలు రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారానికి హాని కలిగించబోమని నాసా స్పష్టం చేసింది. మరి ఈ యుద్ధం కారణంగా ఎవరికి నష్టం జరిగినా ప్రమాదమే. మరి ఈ యుద్ధం ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదు. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ చాలా నష్టపోయింది.

Also Read:  ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు షాకిచ్చిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version