Actors Ali Posani: జగన్‌ను ఎవరేమన్నా సరే వెంటనే రంగంలోకి దిగిపోయి చెడా మడా తిట్టేసే వారిలో పోసాని కృష్ణ మురళి ముందు వరుసలో ఉంటారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అప్పట్లో పవన్ కల్యాణ్ జగన్‌ను విమర్శిస్తే.. పోసాని వరుస ప్రెస్ మీట్లు పెట్టి ఎంతలా రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. ఏకంగా పవన్‌ను వ్యక్తిగతంగా కూడా కించపరిచేలా మాట్లాడారు.

అయితే ఆయనకు వైసీపీ నుంచి మాత్రం చాలా పెద్ద సపోర్టు ఉంది. మొన్న చిరంజీవి టీమ్ టికెట్ల రేట్ల విషయం గురించి మాట్లాడటానికి వెళ్లిన వారిలో పోసాని కూడా ఉన్నారంటేనే ఆయనకు జగన్ ఇస్తున్న ప్రాముఖ్యత అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు వైసీపీ నుంచి ఏదో ఒక పదవి ఖాయమనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కుటుంబంతో కలిసి జగన్‌ను కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను తన కుటుంబం రీసెంట్ గా కరోనా బారిన పడ్డామని, అప్పుడు ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్టు చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న జగన్ భార్య భారతి ఆస్పత్రికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందేలా చూశారని చెప్పుకొచ్చారు. కాగా ఇప్పుడు కోలుకున్నాం కాబట్టి వారికి కృతజ్ఞత చెప్పేందుకు జగన్‌ను కలిసినట్టు చెప్పుకొచ్చారు.

ఇక నటుడు అలీ కూడా తన కుటంబంతో కలిసినప్పుడు ఆయనకు త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని జగన్ హామీ ఇచ్చారు. మొన్న చిరంజీవి టీమ్ లో కూడా అలీ ఉన్నారు. అప్పుడే ఆయనతో జగన్ ఏకాంతంగా మాట్లాడి హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు పోసానికి కూడా అలాంటి పదవి ఇస్తారనే ప్రచారాన్ని పోసాని కృష్ణ మురళి ఖండించారు.
Also Read: మంత్రి గౌతంరెడ్డి ఫ్యామిలీ సంచలనం.. ప్రభుత్వానికి కోట్ల ఆస్తులు.. ఆయన పేరుతో యూనివర్సిటీ
తనకు అలీ లాగా ఎలాంటి పదవి ఇవ్వట్లేదని, ఒకవేళ ఇస్తానంటే తాను వద్దని చెప్పబోనన్నారు. ఇచ్చేది ఉంటే చెప్పుకోవడానికి తాను మొహమాట పడనని కొంత నిరాశగానే చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన ఆశించిన ఫలితం మాత్రం రాలేదనే బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆయన మాత్రం వైసీపీని వీడే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది. పైగా వైసీపీ కోసం ఆయన పవన్ కల్యాణ్ తో పాటు మరికొందరిపై దారుణంగా నోరు పారేసుకున్నారు. దాంతో వారందరికీ ఉమ్మడి శత్రువు అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని వీడితే మాత్రం ఆయన పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది. కాబట్టి ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి ఏదైనా పదవి రాబట్టాలనే ప్లాన్‌లో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ఎన్టీఆర్ ను వాడుకొని చంద్రబాబు-లోకేష్ పై వైసీపీ దాడి?
Recommended Video:
