backstabbing day రచ్చ: ఎన్టీఆర్ కు బాబు పోటు.. నేడు వెన్నుపోటు దినోత్సవమట

పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి తెలుగు దేశం పార్టీని లాక్కొని సీఎంగా, ప్రతిపక్ష నేతగా.. దేశ రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదిగాడు నారా చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారకరామారావును కుర్చీలోంచి దించి సీఎం అయ్యారు. ఆ పార్టీని ఇప్పుడు తన కబంధ హస్తాల్లోనే ఉంచుకొని ‘నందమూరి’ కుటుంబాన్నే ఆ పార్టీలో లేకుండా చేసిన చరిత్ర చంద్రబాబు. 40 ఇయర్స్ చంద్రబాబు పాలిటిక్స్ లో సొంత మామను కూలదోసిన అపఖ్యాతి ఒకటి ఆయనను వెంటాడుతూనే […]

Written By: NARESH, Updated On : August 23, 2021 5:52 pm
Follow us on

పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి తెలుగు దేశం పార్టీని లాక్కొని సీఎంగా, ప్రతిపక్ష నేతగా.. దేశ రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదిగాడు నారా చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారకరామారావును కుర్చీలోంచి దించి సీఎం అయ్యారు. ఆ పార్టీని ఇప్పుడు తన కబంధ హస్తాల్లోనే ఉంచుకొని ‘నందమూరి’ కుటుంబాన్నే ఆ పార్టీలో లేకుండా చేసిన చరిత్ర చంద్రబాబు. 40 ఇయర్స్ చంద్రబాబు పాలిటిక్స్ లో సొంత మామను కూలదోసిన అపఖ్యాతి ఒకటి ఆయనను వెంటాడుతూనే ఉంది. ఎన్టీఆర్ కు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటును ఆయన మరిచిపోయినా ఆయన ప్రత్యర్థులు ముఖ్యంగా వైసీపీ నేతలు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పటికీ మరిచిపోడు.

ఎన్టీఆర్ ను పదవీచిత్యుడైన తర్వాత దేశవ్యాప్తంగా వెన్నుపోటు రాజకీయాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు వెన్నుపోటు రాజకీయాల మీద రచ్చ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే అనేక సందర్భాల్లో చంద్రబాబు వెన్నుపోటు గురించి ప్రస్తావించడం మనం చూస్తునే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన రోజైన ఆగస్టు 23ను అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఒక సంచలన పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశాడు.

ఆగస్టు 23వ తేదీన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును టార్గెట్ చేశారు. 23.8.1995 ఎన్టీఆర్ సీఎం కుర్చీ లాక్కొని ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. నాడు ఎన్టీఆర్ ను సీఎం కుర్చీని పొగొట్టుకోవడం.. పార్టీతోపాటు అధికార పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్లడం జరిగి నేటికి 26 సంవత్సరాలు అయ్యింది.. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తూ మామ ఎన్టీఆర్ వెనుక కత్తి చేతిలో పట్టుకొని నిలుచుకున్న చంద్రబాబు ఫొటోను పోస్ట్ చేసి ఆసక్తికర చర్చకు కారణమయ్యారు.

వైసీపీ నేతలు ఆగస్టు వచ్చిందంటే చాలు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు. ప్రధానంగా ఫోకస్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటారు. అంతర్జాతీయ వెన్నుపోటు దారుల సంఘం అధ్యక్షుడు చంద్రబాబు అంటూ నేటికీ విమర్శిస్తున్నారు.

-సోషల్ మీడియాలో ‘ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం’ రచ్చ
సోషల్ మీడియా వేదికగా ఆగస్టు 23 ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వెన్నుపోటుకు శ్రీకారం చుట్టి నేటికి 26 ఏళ్లని.. ఆగస్టు 23వ తేదీన కుట్ర మొదలైందని.. ఇప్పుడు 23వ తేదీన 23 సీట్లతోనే టీడీపీ మిగిలిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. తమ్ముళ్లందరికీ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన రోజు శుభాకాంోలు అంటూ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాడు ఎన్టీఆర్ ను పార్టీ నుంచే సస్పెండ్ చేసి బహిష్కరించారని.. అయినా సరే ఆయన మరణానికి కారణమై తిరిగి ఆయన ఫొటోనే టీడీపీ వాడుకుంటోందని వైసీపీ ఫాలోవర్స్ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు.

-గోరంట్ల బుచ్చయ్యతో లింక్ పెట్టి చంద్రబాబును టార్గెట్
నాడు ఎన్టీఆర్ కు చంద్రబాబు, బాలక్రిష్ణలు వెన్నుపోటు పొడిచారని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్ కు మద్దతుగా ఉన్న 29 మందిలో ఇప్పుడు టీడీపీలో ఉన్న చివరాఖరి వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటూ ఇక ఆయనను కూడా చంద్రబాబు బయటకు పంపుతున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్ కు బుచ్చయ్య చౌదరి మద్దతుగా ఉండడం వల్లే ఇప్పుడు ఆయనను టార్గెట్ చేశారని ఆసక్తికర ట్వీట్ లు పెడుతున్నారు.