Interesting Facts In CAG Report: ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాస్త రుణాంధ్రప్రదేశ్ గా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ చేస్తున్న అప్పులు పెద్దగా లేవని చెబుతోంది. దీంతో ప్రభుత్వానికి ఊపిరి పోసినట్లు అయింది. ఒకవైపు టీడీపీ రాష్ట్రం మొత్తం అప్పులమయంగా మారిపోయిందని చెబుతూనే ఉంది. దీనిపై కాగ్ నివేదిక బయటకు రావడంతో ఏపీకి కొండంత అండ దొరికినట్లు అయింది. ప్రస్తుతం కాగ్ నివేదికతో ప్రభుత్వ మనుగడకు ఢోకా లేదని తెలుస్తోంది.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ చేస్తున్న అప్పులు తక్కువేనని చెబుతోంది. దీంతో ప్రభుత్వం కాగ్ నివేదికతో హర్షం వ్యక్తం చేస్తోంది. అప్పుల విషయంలో ఏపీ పారదర్శకత పాటిస్తోందని సూచిస్తోంది. తీసుకున్న అప్పులకు సరైన లెక్కలు చూపిస్తోందని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వానికి కాగ్ నివేదిక ఎంతో బలం చేకూరుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ద్రవ్య లోటును కూడా తగ్గించుకుంటోంది. 2021-22 సంవత్సరంలో చేసిన అప్పులతో ప్రజలకు చేరాల్సిన పథకాలకు నిధులు చేరుస్తున్నారు.
Also Read: Adivi Sesh: ఆ హీరోకి ఉన్న అఫైర్లు నాకు లేవు – అడవి శేష్
టీడీపీ హయాంలో ద్రవ్యలోటు మూడు శాతం ఉండగా ప్రస్తుతం 2.10శాతానికి తగ్గించింది. దీంతో వైసీపీ విధానాలతో ద్రవ్య లోటును తగ్గిస్తూ వస్తోంది. కాగ్ నివేదిక ప్రకారం వైసీపీ తీసుకున్న చర్యల వల్లే ద్రవ్య లోటు తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీని వల్ల ప్రభుత్వం విచక్షణతోనే పురోభివృద్ధి సాధ్యమవుతోంది. టీడీపీ చెబుతున్న అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ చెబుతున్న వాటిని ప్రజలు విశ్వసించరని వెల్లడిస్తోంది.
వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు ఉద్దేశించి వారి ఖాతాలకు డబ్బులు పంపిస్తోంది. దీంతో వారి ఆర్థిక పరిపుష్టి పెరుగుతోంది. ఫలితంగా ప్రజల ఆదాయం వృద్ధి చెందుతోంది. జన అవసరాలు తీర్చే క్రమంలో వైసీపీ చేస్తున్న తీరుతో మేలు జరుగుతోందని చెబుతోంది. అందుకే నిధులు వృధా కాకుండా సద్వినియోగం చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కాగ్ వెల్లడించింది. భవిష్యత్ లో కూడా ఇలాగే కొనసాగితే మంచి ఫలితాలు వచ్చే సూచనలున్నట్లు తెలుస్తోంది.
Also Read: Harassment Of Bears: సిక్కోలులో భల్లూకాల బీభత్సం.. ప్రాణాలు కోల్పోతున్న జనం