Agneepath: అగ్నిపథ్.. బీజేపీని కడిగిపారేసిన కేటీఆర్

Agneepath: అగ్నిపథ్ జ్వాలలు ఆరడం లేదు. దేశవ్యాప్తంగా ఆందోళను పెల్లుబికుతూనే ఉన్నాయి. అయినా కేంద్రం మాత్రం దిగిరావడం లేదు. ఫలితంగా పరీక్ష నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంతో దేశంలో నానా బీభత్సం జరిగింది. యువత రెచ్చిపోయి రైళ్లకు నిప్పు పెట్టారు. ఫలితంగా రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం కలిగింది. దీనిపై రాజకీయ పార్టీల్లో ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. రాష్ట్రంలో గొడవలకు మూలం టీఆర్ఎస్ పార్టీ అని బీజేపీ ఆరోపిస్తే కేంద్రం నిర్ణయంతోనే […]

Written By: Srinivas, Updated On : June 20, 2022 3:53 pm
Follow us on

Agneepath: అగ్నిపథ్ జ్వాలలు ఆరడం లేదు. దేశవ్యాప్తంగా ఆందోళను పెల్లుబికుతూనే ఉన్నాయి. అయినా కేంద్రం మాత్రం దిగిరావడం లేదు. ఫలితంగా పరీక్ష నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంతో దేశంలో నానా బీభత్సం జరిగింది. యువత రెచ్చిపోయి రైళ్లకు నిప్పు పెట్టారు. ఫలితంగా రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం కలిగింది. దీనిపై రాజకీయ పార్టీల్లో ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. రాష్ట్రంలో గొడవలకు మూలం టీఆర్ఎస్ పార్టీ అని బీజేపీ ఆరోపిస్తే కేంద్రం నిర్ణయంతోనే యువత రెచ్చిపోయిందని టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. దీంతో అగ్నిపథ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ లా మారింది.

అగ్నిపథ్ పథకంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడుతున్నారు కేంద్రం ఏకపక్ష నిర్ణయంతో యువత గగ్గోలు పెడుతున్నా దిగిరాకుండా ఒంటెత్తు పోకడతో ముదుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపథ్ పై యువత ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం పెడచెవిన పెడుతోంది. అయినా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. వారి ఆందోళనలను గుర్తించి వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్తోంది.

Minister KTR

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కేంద్రం తీరుపై విమర్శలు చేస్తున్నారు. అగ్నిపథ్ వ్యవహారంలో కేంద్రం దురుసుగా ముందుకు పోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని తీరును తప్పుబడుతున్నారు. అగ్నిపథ్ ద్వారా నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నించడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయినా కేంద్రం పట్టించుకోకుండా అగ్నిపథ్ పై మొండిగా ముందుకెళ్తోందని మంత్రి చెబుతున్నారు. నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకుని మళ్లీ కొత్తగా నియామకాలు చేపట్టాలని కోరుతున్నా వినిపించుకోవడం లేదు. ఫలితంగా మరింత గొడవలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Also Read: Secunderabad Railway Station Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ను లైట్ తీసుకుంటున్న ఉభయ రాష్ట్రాల పోలీసులు

కేంద్రం వ్యవహారంపై కేటీఆర్ తనదైన శైలిలో ఘాటుగా విమర్శలు చేశారు. యువత భవిష్యత్ నిర్వీర్యం చేసే ప్రణాళికలు రచిస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని కఠిన నిర్ణయాల తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారో తెలియడం లేదు. ఈ క్రమంలో బీజేపీ చేస్తున్న దానిపై విరుచుకుపడ్డారు. మళ్లీ యువత ఆందోళనలు చేస్తే ఇతరులను నిందించకుండా ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని తెలిపారు. కానీ కేంద్రం నిర్ణయం ఎవరకి ఆమోదయోగ్యంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ante Sundaraniki OTT Date: అంటే సుందరానికి OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

Tags