Vijaysai Reddy: అవసరాలు ఎంత పనైనా చేయిస్తాయి అంటారు. దీనికి ఎవరు అతీతం కాదు. సమయం, సందర్భం బట్టి ప్రవర్తించాల్సి ఉంటుంది. ఏపీ సీఎం జగన్ కూడా ఇలాంటి చిక్కే ఒకటి వచ్చి పడింది. ముసలోడు అయిపోయి రిటైర్మెంట్ ప్రకటించిన విజయ్ సాయి రెడ్డిని తెచ్చుకోవాల్సి వచ్చింది. ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.
దాదాపు ఆరుపదులు దాటిన విజయసాయిరెడ్డికి జగన్ రిటైర్మెంట్ ప్రకటించారు. పార్టీ వర్క్ షాప్ లోనే ఏకంగా పార్టీ సమన్వయ బాధ్యతలన్నీ తప్పించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు గానీ.. మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఏకంగా రాయలసీమ కోస్తా లో నాలుగు జిల్లాల బాధ్యతలను కట్టబెట్టారు. పార్టీలో ఇది కొత్త చర్చకు దారితీసింది.
వాస్తవానికి విజయసాయిరెడ్డి పాత్ర వైసీపీలో కీలకం. గత ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఆయన చేసిన కృషి అంతా కాదు. పార్టీ సంక్షేమం కోసం అగ్ర నేతల కాళ్లు పట్టుకునేందుకు కూడా విజయ్ సాయి వెనుకడుగు వేయలేదు. సామవేద దండోపాయాలను ప్రయోగించారు. పార్టీ విజయానికి అలుపెరగని కృషి చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఉత్తరాంధ్ర బాధ్యతల్ని తీసుకున్నారు. కానీ ఉన్నపళంగా విజయ్ సాయి రెడ్డి వద్ద ఉన్న పదవులను తొలగించి అచేతనం చేశారు.
వైసీపీలోకి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రవేశం చేశాకే విజయ్ సాయి రెడ్డికి గడ్డు పరిస్థితిలు ఎదురయ్యాయి. గతంలో విజయసాయిరెడ్డి చేసిన పనులన్నింటికీ కొత్త మనుషులను పెట్టుకున్నారు సజ్జల వారు . దీంతో విజయసాయి అవసరం లేకుండా పోయింది. అందుకే దాదాపు ఒక ఏడాది పాటు పక్కన పెట్టారు. కానీ రాజకీయ కుతంత్రాలకు అలవాటు పడిన విజయసాయి సేవలను మెప్పించలేకపోయారు. అందుకే విజయసాయి ఆగమనం వైసీపీలో అనివార్యంగా మారింది.