Rashmika Mandanna- Vijay Deverakonda: సినిమా ఇండస్ట్రీ అన్నాక రోజు ఏదో ఒక రూమర్ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు మీద మనం రోజు ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉంటాము. అయితే కథ కొద్ది సంవత్సరాల నుంచి తెలుగు వారికి ఆసక్తి కలిగిస్తున్న ప్రేమ వ్యవహారం ఎవరిదైనా ఉంది అంటే అది విజయ దేవరకొండ మరియు రష్మిక మందానది.
తెగదు తేల్చరు అన్నట్టుగా కొనసాగుతోంది వీరి ప్రేమ వ్యవహారం. ఎందుకు అంటే ప్రతి కొద్ది రోజులకు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చేసే పని వీరిద్దరి మధ్య ఏదో ఒకటి ఉందని అనుమానం క్రియేట్ చేస్తూ ఉంటుంది. కానీ వీరిద్దరూ మాత్రం ఆ ప్రేమ వ్యవహారం గురించి స్ట్రైట్ గా చెప్పరు. కానీ వీరు చేసే పనులు మాత్రం పలుసార్లు వీరు ప్రేమలో ఉన్నట్టే చూపిస్తూ వచ్చాయి. మొదటగా వీరిద్దరూ మాల్దీవ్స్ లో వెకేషన్ కి వెళ్లారు అనే దగ్గర నుంచి వీరి ప్రేమ రూమర్ మరింత బలపడింది. అయితే ఈ వెకేషన్ మరియు ప్రేమ రూమర్ రావడానికి కారణం వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలే. ఎయిర్పోర్టులో డిఫరెంట్ టైమింగ్స్ లో ఒకేరోజు ఫోటో తీసుకొని వాటిని ఇంస్టాగ్రామ్ లో వేయడం, అలానే ఒకే బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు వేరువేరుగా తీసుకున్న ఫోటోలు కూడా షేర్ చేయడం లాంటివి అనుమానాలను రెట్టింపు చేశాయి.
ఇక తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి లాగా విజయ్ దేవరకొండ ఇన్ సెక్యూర్డ్ అబ్బాయి కాదు అని రష్మిక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అని ఒక ప్రముఖ వెబ్సైట్ ప్రచారించడం కూడా జరిగింది. ఆ ప్రముఖ వెబ్సైట్ రాసిన ఆర్టికల్ ప్రకారం ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ కి కొద్ది సంవత్సరాల క్రితం రష్మిక ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షిత్, విజయ దేవరకొండ గురించి మాట్లాడుతూ..రక్షిత్ శెట్టితో విడిపోయిన తర్వాత బాధలో ఉన్న తనకు విజయ్ ఎంతో ఓదార్పునిచ్చాడని, కేర్ చూపించాడని చెప్పిందట. అంతేకాదు విజయ్ తన ప్రపంచంలో తాను చాలా సింపుల్‌గా జీవిస్తాడని, గీతా గోవిందం సమయంలో విజయ్ కి తనకు మధ్య స్నేహం మాత్రమే ఉండేదని కానీ తరువాత మాత్రం ఈక్వేషన్ మారుతూ వచ్చిందని, అంతేకాకుండా విజయ్ తన మాజీ ప్రియుడు రక్షిత్ లాగా ఇన్‌సెక్యూర్ కాదని, చాలా ఫ్రీ మైండెడ్ అని కూడా చెప్పిందని ఆ వెబ్సైట్ రాసుకువచ్చింది.
ఇక ఈ ఇంటర్వ్యూ ఎంతవరకు నిజమో తెలియకపోయినా ప్రేక్షకులు మాత్రం ఇది చదివి వందకు వందశాతం వీరిద్దరి ప్రేమ లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. మరి ఇన్ని రూమర్స్ వస్తూ ఉంటే అలానే ఆ ఇంటర్వ్యూ తాను ఇచ్చింది కాకపోతే రష్మిక దానికి ఏమన్నా ఫుల్ స్టాప్ పెట్టిందా అంటే అది కూడా చేయలేదు. అక్కడితో ఆగకుండా ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరుస్తూ వచ్చింది.
ఈమధ్య విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా కి కూడా తన సపోర్ట్ ఎంతగానో ఇచ్చింది రష్మిక. అంతేకాదు ఈ సినిమా ప్రీమియర్ ని విజయ్ తో పాటు చూసి ఒక ట్వీట్ కూడా వేసేసింది. ఇక ఈరోజు కూడా తాను విజయ్ తో నటించిన డియర్ కామ్రేడ్ గురించి ఒక స్పెషల్ పోస్ట్ చేసింది రష్మిక. విజయ్ తో దిగిన ఒక ఫోటోని అభిమానులతో పంచుకున్న రష్మిక.. విజయ్ దేవరకొండ తో నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఎప్పటికీ తన మనసుకు దగ్గరైన సినిమా అంటూ చెప్పుకొచ్చింది.
ఫీల్ గుడ్ ప్రేమ కథతో రూపొందుకున్న ఈ చిత్రాన్ని భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. 2019లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. యావరేజ్ హిట్ కూడా కానీ ఈ సినిమాని తన మనసులో ప్రత్యేక ప్లేస్ ఉంది అంటూ రష్మిక పోస్టు వేయడంతో, అది విజయ్ దేవరకొండ వల్లే వేసింది అని చాలామంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా సమయంలోనే వీరి స్నేహం ప్రేమగా చిగురించింది అనే వార్తలు ఉన్నాయి. అందుకే రష్మిక ఇలా పెట్టింది అని అంటున్నారు చాలామంది.
అయితే వీరి ప్రేమ వ్యవహారంపై వీరిద్దరూ మీడియా ముందుకి వచ్చి చెప్పే వరకు మనం కూడా ఏదీ ఫిక్స్ అవ్వలేము. అయితే ఇన్ని జరిగాక కూడా వీరి ప్రేమ వార్తలు నిజం లేదు అని కూడా మనము అనుకోలేము. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.