Mahua Moitra: ఆమె ఓ కార్పొరేట్.. అన్నింటికీ “లెక్క” ఉంటుంది.. చివరికి రాజకీయాలు కూడా..

మహువా మొయిత్రా.. రాజకీయాల్లోకి రాకమందు జేపీ మోర్గాన్ అనే కార్పొరేట్ సంస్థలో కీలక హోదాలో పనిచేశారు. న్యూయార్క్, లండన్ ప్రాంతాలలో నివాసం ఉన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 19, 2024 8:43 am

Mahua Moitra

Follow us on

Mahua Moitra: మహువా మొయిత్రా .. ఈ పేరే ఒక ఫైర్ బ్రాండ్. తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీ, ఆమె అల్లుడు తర్వాత అంతటి పాపులర్ ఆమె. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు ముడుపులు తీసుకున్నారని, గిఫ్టులు స్వీకరించారని.. లంచాలు అడిగారనే ఆరోపణలతో ఆమె పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కృష్ణానగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. అనేక ఆరోపణల నేపథ్యంలో ఆమె పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఆమె అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.. ఇటీవల పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ మమతా బెనర్జీ ఆమెకే టికెట్ ఇవ్వడం..పైగా అదే స్థానం నుంచి కావడం విశేషం.

మహువా మొయిత్రా.. రాజకీయాల్లోకి రాకమందు జేపీ మోర్గాన్ అనే కార్పొరేట్ సంస్థలో కీలక హోదాలో పనిచేశారు. న్యూయార్క్, లండన్ ప్రాంతాలలో నివాసం ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ లో చేరి ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కృష్ణానగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజల సమస్యల పరిష్కారాని కంటే.. కార్పొరేట్ నాయకురాలిగా ఎదిగారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం అదే స్థానం నుంచి మహువా మొయిత్రా పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో పార్లమెంట్ ఎన్నికలను పూర్తిస్థాయి కార్పొరేట్ ఎన్నికలుగా మార్చారు. ఇందుకోసం ఏకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దానిని నిర్వహించేందుకు ఆరు నుంచి పదిమంది వ్యక్తుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ కృష్ణానగర్ నియోజకవర్గంలోని ప్రతి అంశాన్ని నమోదు చేస్తుంది. “ప్రతి అంశాన్ని ప్రణాళిక బద్ధంగా చేయాలనేది మహువా మొయిత్రా ఆలోచన. కార్పొరేట్ సెక్టార్లో ఆమె పనిచేయడం వల్ల ఇలాంటి విధానం అవలంబిస్తున్నట్టున్నారు. నేను ఎన్నికల పనులు మొత్తం విభజించాను..మహువా మొయిత్రా తన పోల్ వ్యూహాన్ని పటిష్టం చేసుకోవడంలో యువ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వార్ రూమ్ లో పని చేసేవారు క్రమశిక్షణ తో ఉంటారు. అక్కడ బోర్డులో పేర్కొనే అంశాలు రోజువారీ ప్రణాళికను వివరిస్తాయని” మహువా మొయిత్రా అనుచరుడొకరు వ్యాఖ్యానించారు.

మహువా మొయిత్రా తన పోల్ వ్యూహాన్ని పటిష్టం చేసుకునేందుకు యువకులతో బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి హార్డ్ టాస్క్ మాస్టర్ అని పేరు పెట్టారు. బూత్ లీడర్లతో ప్రతిరోజు సమావేశాలు నిర్వహిస్తుంటారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మాత్రమే కాకుండా ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. మహువా మొయిత్రా ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణానగర్ నియోజకవర్గంలో 1800 పైగా పోలింగ్ బూత్ లు ఉన్నాయి. “ఎన్నికల ప్రచారంలో వివిధ దశలు ఉన్నాయి. వాటిని ఒక పరీక్షలాగా మేము చూస్తున్నాం. ఇందుకోసం ప్రణాళిక రూపొందించాం. ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నామని” మహువా మొయిత్రా చెబుతున్నారు. కాగా, గత ఎన్నికల్లో దాదాపు 45% ఓట్లతో మహువా మొయిత్రా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారు.