G20 Summit India: జీ_20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఇటీవల నిర్మించిన భారత్ మండపం వేదికగా 9, 10 తేదీల్లో జరిగే సదస్సుకు హాజరయ్యే ఆహుతులు, వివిధ దేశాల అధ్యక్ష, ప్రధానులు, ముఖ్య అతిధులు అబ్బురపడేలా కేంద్రం చర్యలు తీసుకుంది. భరత్ మండపానికి దారి తీసే మార్గాల్లో… భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వేదాలకు సంబంధించిన అంశాలపై వేరువేరుగా ప్రదర్శనలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ముఖ్య అతిథులకు వెండి, బంగారు పాత్రల్లో భోజనాల వడ్డన మొదలు.. దేశాధినేతల సతీమణులకు చిరుధాన్యాలతో విందు, వారి భద్రతకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నిరంతర నిఘా, 50 వేల మంది పోలీసులతో బందోబస్తు.. ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి.
క్రీస్తుపూర్వం 2,500 సంవత్సరాల నాటి హరప్పా నాగరికతకు చెందిన యువతి (19 27 తవ్వకాల్లో దొరికిన నాట్యగత్తే విగ్రహాన్ని పోలి ఉంటుంది) అవతార్ ఈ సదస్సుకు వచ్చే అతిధులకు ఆహ్వానం పలుకుతుంది. నిజానికి హరప్పా తవ్వకాల్లో దొరికిన నాట్య గత్తే విగ్రహం ఎత్తు 10.5 సెంటీమీటర్లు. కాగా భారత్ మండపం వద్ద ఐదు అడుగుల ఎత్తు, 120 కిలోల కాంస్యం తో తయారుచేసిన హరప్పా యువతిని పోలిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ప్రాంగణంలోని మదర్ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిబిషన్ వద్ద ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఏర్పాటుచేసిన అవతార్.. 16 భాషల్లో అతిథులకు స్వాగతం పలుకుతుంది.
ఏళ్ళ నాటి ప్రజాస్వామ్యం
1950 జనవరి 26 నుంచి భారత గణతంత్ర రాజ్యం గా మారిన విషయం అందరికీ తెలిసిందే. 1764లో ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చిన రెగ్యులేషన్ చట్టం భారత్లో తొలి లిఖిత రాజ్యాంగం అని చెబుతారు. కానీ ఐదు వేల సంవత్సరాల క్రితమే భారత్ లో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లింది అని చెప్పే విధంగా మదర్ ఆఫ్ డెమోక్రసీ ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది. సింధు నాగరికత కాలం (క్రీస్తుపూర్వం 2,500_1,750) లలో ప్రజాస్వామ్య తీరు మొదలు, షోడష జానపదాల కాలం దాకా.. ప్రజలే పాలకులను ఎన్నుకునే పద్ధతిని ఈ ప్రదర్శనలో వివరిస్తారని తెలుస్తోంది. రాజరికలు మొదలై బ్రిటిష్ పరిపాలన.. భారత్ స్వాతంత్రం పొందే దాకా జరిగిన సమగ్ర చరిత్రను అక్కడ అందుబాటులో ఉంచుతారని తెలిసింది. రాజ్యాంగాన్ని పోలిన చాణక్యుడి రాజనీతి సూత్రాలు, వాటి భాగాలు వంటివి కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటన్నింటినీ అతిధులకు అర్థమయ్యే విధంగా 26 ఇంట్రాక్టివ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 16 భాషల్లో వాటిని తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. మండపం ప్రాంగణంలో మొత్తం పదివేల చదరపు అడుగుల స్థలంలో వేరువేరు అంశాలపై ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా.. యోగా, కుంభమేళా, డబుల్ ఇక్కత్ చేనేత వంటివి కూడా ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి ఆయా ప్రాంతాల ప్రత్యేక కళలకు ఈ ప్రదర్శనలో చోటు కల్పించారు. రుగ్వేదానికి చెందిన రాతప్రతులను కూడా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. జి_ 20 దేశాధినేతల విడిదికి తాజ్ గ్రూప్ తో సహా శాంగ్రీల, మౌర్య, షెరటాన్, మెరీడియన్, ఒబెరాయ్ తదితర హోటళ్ళను ఎంపిక చేశారు. అక్కడ వారు భోజనాలు తినేందుకు ప్రత్యేకంగా వెండి, బంగారు పాత్రలు రూపొందించారు. సదస్సుకు వచ్చే దేశాధినేతల సతీమణుల కోసం ప్రత్యేకంగా చిరుధాన్యాలతో విందు ఏర్పాటు చేస్తారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉదయం నుంచి వారికోసం చిరుధాన్యాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి. ఇందుకోసం ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో రైతును ఢిల్లీకి పిలిపించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సతీమణి .. వివిధ దేశాధినేతల భార్యలకు చిరుధాన్యాలతో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Interesting facts about g20 summit 2023
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com